న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతికి బదులుగా స్టంప్స్‌ను బాదిన పాక్ క్రికెటర్‌ (వీడియో)

Shoaib Malik's Hilarious Hit-Wicket In England VS Pak Match || Oneindia Telugu
video: Shoaib Malik Clatters His Own Stumps, Twitter Cant Stop Laughing

పాకిస్థాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ బంతికి బదులుగా స్టంప్స్‌ను బాదాడు. దీంతో హిట్‌ వికెట్‌ ఔట్ అయి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. మాములుగా క్రికెట్‌లో ఆటలో బ్యాట్స్‌మన్‌లు హిట్‌ వికెట్‌ అవ్వడం సాధారణ విషయం. షాట్ ఆడే క్రమంలో బ్యాట్స్‌మన్‌ అదుపు తప్పి వికెట్లను తాకుతారు. కానీ షోయబ్ మాత్రం బంతిని వదిలేసి, వికెట్లను బాదడంతో వార్తల్లో నిలిచాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

షోయబ్‌ హిట్‌ వికెట్‌:

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో షోయబ్‌ విచిత్రంగా అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్‌ ఫాస్ట్ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ వేసిన 47 ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. అనంతరం రెండు, మూడు బంతులకు రెండేసి పరుగులు చేశాడు. నాలుగో బంతికి.. బ్యాక్ ఫుట్ తీసుకుని బంతిని కొట్టబోయి స్టంప్స్‌ను కొట్టాడు. దీంతో షోయబ్‌ హిట్‌ వికెట్‌ ఔట్ అయ్యాడు. షోయబ్‌ ఆడిన షాట్ చూసి మైదానంలోని ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు.

బంతిని కొట్టాలి కానీ.. స్టంప్స్‌ను కాదు:

బంతిని కొట్టాలి కానీ.. స్టంప్స్‌ను కాదు:

దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు మాలిక్‌పై తమదైన స్టయిల్లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘క్రీజులో ఉన్నప్పుడు బంతిని కొట్టాలి కానీ.. స్టంప్స్‌ను కాదు', ‘పాక్‌ క్రికెటర్లు మాత్రమే ఇలా ఔటవ్వగలరు. వీళ్లు మైదానంలో కావల్సినంత వినోదాన్ని పంచుతారు', ‘షోయబ్‌.. అది టెన్నిస్ కాదు క్రికెట్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇది రెండోసారి:

ఇది రెండోసారి:

వన్డే క్రికెట్‌లో మాలిక్‌ హిట్‌ వికెట్‌గా ఔట్‌ కావడం ఇది రెండోసారి. 2003లో తొలిసారి హిట్‌ వికెట్ ఔట్ అయ్యాడు. 16 ఏళ్ల తర్వాత మల్లి ఇప్పుడు ఔట్‌ అయ్యాడు. షోయబ్ 26 బంతుల్లో 4 ఫోర్లు సాయంతో 41 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ మరో మూడు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.

Story first published: Saturday, May 18, 2019, 17:06 [IST]
Other articles published on May 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X