న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోఫ్రా ఆర్చర్ హ్యాట్రిక్ వికెట్ల వీడియో చూశారా?

By Nageshwara Rao
VIDEO: Jofra Archers hat-trick for Sussex against Middlesex

హైదరాబాద్: జోఫ్రా ఆర్చర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయం ఉన్న పేరే. వెస్టిండిస్‌కు చెందిన ఈ బౌలర్‌ని ఈ ఏడాది మొదట్లో బెంగళారు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ.7.2 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. గంటకు 140 కిమీపైగా వేగంతో బౌలింగ్‌ వేయడమే ఇతగాడి బలం.

ప్రధానంగా యార్కర్లు, బౌన్సర్లు సంధించడంలో మంచి అనుభ‌వం ఉంది. తాజాగా ఓ టీ20 టోర్నీలో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌‌‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ జట్టుతో మ్యాచ్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జోఫ్రా హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగాడు.

ముఖ్యంగా డెత్ బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు. మిడిల్‌సెక్స్ విజయానికి చివరి నాలుగు బంతుల్లో 14 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికే క్రీజులో పాతుకుపోయి దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(90)ను తొలుత పెవిలియన్ పంపాడు.

ఆ తర్వాతి రెండు బంతుల్లో జాన్ సిప్సన్, జేమ్స్ ఫుల్లర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ 19.4 ఓవర్లలో 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులే చేసి ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జోఫ్రా ఆర్చర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంక్షిప్తి స్కోర్లు:
ససెక్స్:
168 in 19.4 overs [Philip Salt 50(20), Delray Rawlins 49(35); Ravi Patel 3-0-27-2, Tom Barber 4-0-28-4, Ashton Agar 4-0-41-3] beat
మిడిల్‌సెక్స్: 156 for 7 in 20 overs [Eoin Morgan 90(56); Jofra Archer 4-0-25-3, Danny Briggs 4-0-23-2] by 12 runs.

Story first published: Friday, August 3, 2018, 13:31 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X