న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ శాంసన్ ఈ నిర్లక్ష్యం పనికిరాదు.. ఇలా ఆడితే ఎంత టాలెంట్ ఉన్న వేస్టే : భారత మాజీ క్రికెటర్

Venugopal Rao Slams Sanju Samson after Rajasthan Royals Batsman’s Poor Show in IPL 2020
IPL 2020 : What's Wrong With Sanju Samson? RR Batsman Fails in 8 Successive innings

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు. ఎంతో ప్రతిభ కలిగిన శాంసన్ అనవసర తప్పిదాలతో వరుసగా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఎంత సేపు భారీ షాట్లు ఆడుతూ మూల్యం చెల్లించుకుంటున్నాడని, టీ20 క్రికెట్ అంటే ఎంతసేపు ఫోర్లు, సిక్స్‌లే కాదని చురకలంటించాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో గెలిచి ప్లే ఆశలను నిలుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బైజూస్ క్రికెట్ లైవ్ షోలో మాట్లాడిన వేణు.. శాంసన్ బాధ్యతాయుతంగా ఆడాలని సూచించాడు.

ఈ నిర్లక్ష్యం పనికిరాదు..

ఈ నిర్లక్ష్యం పనికిరాదు..

‘సంజూ శాంసన్.. టీ20 క్రికెట్ అంటే ఫోర్లు, సిక్స్‌లే కాదు. జట్టు విజయానికి తగ్గట్టు ఆడాలి. భారీ షాట్లు ఆడలేని పరిస్థితుల్లో క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్ రేట్ మెయింటేన్ చేయాలి. కానీ నిర్లక్ష్యపు ఆటతో జట్టు విజయవకాశాలను దెబ్బతీయవద్దు. గత ఏడు మ్యాచ్‌లుగా శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ పడిన మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఏంత ప్రతిభ ఉన్నా పక్కన పెట్టేస్తారు.'అని వేణుగోపాల్ రావు సూచించాడు.

శాంసన్‌ది అదే వైఫల్యం..

శాంసన్‌ది అదే వైఫల్యం..

ఇక వేణు అన్నట్లే తాజా మ్యాచ్‌లో కూడా శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ధోనీ సూపర్ క్యాచ్‌కు బ్రాంజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పేలవ షాట్లతో స్టోక్స్‌ (19), ఉతప్ప (4) ఔటైన క్రమంలో బాధ్యత తీసుకోవాల్సిన శాంసన్.. దీపక్ చాహర్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కు ఏడ్జ్ తీసుకోగా.. ధోనీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(74, 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన శాంసన్.. తువాతి 8 మ్యాచ్‌ల్లో 8, 4, 0, 5, 26, 25, 9, 0 తో దారుణంగా విఫలమయ్యాడు.

గత రెండు సీజన్‌లోనూ అదే కథ..

గత రెండు సీజన్‌లోనూ అదే కథ..

ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది కొత్త కాదు. గత రెండు సీజన్లలో కూడా ఈ కేరళ బ్యాట్స్‌మెన్ ఇలాంటి ప్రదర్శననే కనబర్చాడు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడటం తర్వాత పత్తాలేకుండా పోవడం అతనికి అలవాటే. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో చెలరేగిన శాంసన్(55 బంతుల్లో 102 నాటౌట్) ఇప్పటిలానే అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత పది మ్యాచ్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 8, 6, 31, 27, 35, 0, 22, 48 నాటౌట్, 28, 5తో విఫలమయ్యాడు. మళ్లీ సన్‌రైజర్స్‌తో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

జోస్ బట్లర్ మెరుపులు..

జోస్ బట్లర్ మెరుపులు..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ధోనీ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జోస్‌ బట్లర్‌ (48 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (34 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయాన్నందించారు. ఈ గెలుపుతో రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశలపై ఆశలను రెకెత్తించింది.

CSK vs RR: ధోనీ కెప్టెన్సీలో ఆ స్పార్క్ ఏది..? రాజస్థాన్ చేతిలో చెన్నై ఓటమికి కారణాలివే!

Story first published: Tuesday, October 20, 2020, 10:58 [IST]
Other articles published on Oct 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X