న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ పాండ్యా వల్లే నాకు అవకాశం లేకుండా పోయింది: వెంకటేశ్ అయ్యర్

Venkatesh Iyer says ‘Wanted a longer run in Team India but Hardik Pandya came back…’

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో జట్టులో తనకు అవకాశం లేకుండా పోయిందని యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ అన్నాడు. గాయంతో హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన సమయంలో భారత జట్టులో వరుసగా వెంకటేశ్ అయ్యర్ అవకాశాలు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడు వెంకటేశ్ అయ్యరేనని అంతా భావించారు. కానీ ఐపీఎల్ 2022 సీజన్‌తో సూపర్ ఫిట్ అయిన హార్దిక్ జట్టులోకి రావడంతో వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఇదే విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా రీఎంట్రీతోనే టీ20 ప్రపంచకప్ ఆడలేకపోయానని చెప్పాడు.

'టీమిండియాలో సుదీర్ఘకాలం ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు. నేను కూడా కొన్నేళ్ల పాటు జట్టులో ఉండాలనే అనుకున్నాను. అయితే హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ తర్వాత సీన్ మారిపోయింది. పాండ్యా ఎంట్రీతో నాకు టీ20 వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ ఉండదని అర్థమైపోయింది. హార్ధిక్ పాండ్యా అద్భుతంగా ఆడాడు. టీమిండియాకి కీ ప్లేయర్.. అలాంటి ప్లేయర్ ఉండాలని ఏ టీమ్‌ అయినా కోరుకుంటుంది. నేను జట్టులో ఉండాలనుకున్నాను. అయితే అన్నీ మన చేతుల్లో ఉండవు కదా.. భారత జట్టుకి ఆడకపోయినా ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాను.

ఏ జట్టుకి ఆడినా సెలక్షన్ గురించి దిగులు పడకుండా నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో నాకు ప్లేస్ దక్కకపోవడానికి గాయం కూడా కారణం. ఇప్పుడైతే నాకు దేని గురించి బాధలేదు. నా టైం వచ్చినప్పుడు నన్ను నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా'అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో కేకేఆర్ జట్టుకి ఓపెనర్‌గా మారిన వెంకటేశ్ అయ్యర్... 4 హాఫ్ సెంచరీలతో 380 పరుగులు చేసి అదరగొట్టాడు. ఫస్ట్ ఫేజ్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్, సెకండ్ ఫేజ్‌లో వరుస విజయాలు అందుకుని ఫైనల్ చేరిందంటే అయ్యర్ ఆటే కారణం. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రీఫీల్లోనూ మెప్పించిన వెంకటేశ్ అయ్యర్... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో ఆల్‌రౌండర్‌గా 2 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడాడు అయ్యర్. అయితే ఎంత త్వరగా జట్టులోకి వచ్చాడో, అంతే వేగంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు.

Story first published: Saturday, November 26, 2022, 18:07 [IST]
Other articles published on Nov 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X