న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

7 నెలల్లో వరల్డ్ కప్.. కుదురుకోని టీమిండియా మిడిలార్డర్

Used to middle-order role, need thinking of World Cup

హైదరాబాద్: స్వదేశంలో టీమిండియా అద్వితీయ విజయాలతో అబ్బుర పరుస్తోంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బౌలర్లపై దాడి చేస్తూ.. పరుగుల వర్షం కురిపిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌ ఎవరో ఒకరు సెంచరీతో మైదానంలో చివరి వరకు నిలుస్తున్నారు. ఇక వచ్చిన సమస్యల్లా మిడిలార్డర్‌తోనే.. మరో ఏడు నెలల్లో ఇంగ్లాండ్‌లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది. కోహ్లీసేన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్నట్టే కనిపిస్తోంది.

నిజానికి ద్రవిడ్‌ స్థానానికి అజింక్య రహానె

నిజానికి ద్రవిడ్‌ స్థానానికి అజింక్య రహానె

ప్రస్తుతం సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌లా ఆడే క్రికెటర్లకు టీమిండియాలో కొదవలేదు. విరాట్‌, రోహిత్‌, ధావన్‌, ఇప్పుడు అంబటి రాయుడు ఆ బాధ తీరుస్తున్నారు. లేనిదల్లా ద్రవిడ్‌, ధోనీ, యువరాజ్‌లా మ్యాచ్‌లకు విజయవంతమైన ముగింపును ఇచ్చేవారు. అజింక్య రహానె నిజానికి ద్రవిడ్‌ స్థానానికి సరిపోతాడు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ పిచ్‌లపై అతడు నిలకడగా ఆడగలడు.

అఫ్రీదీకి అక్తర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతోన్న గంభీర్

 మిడిలార్డర్‌ బాధ్యతను యువీనే

మిడిలార్డర్‌ బాధ్యతను యువీనే

అద్భుతమైన టెక్నిక్‌. బంతిని అడ్డంగా ఆడగలడు. కానీ కోహ్లీ, రవిశాస్త్రి ద్వయం ఏడాది కాలంగా అతడికి వన్డేల్లో అవకాశాలే ఇవ్వడం లేదు. 2011 వన్డే ప్రపంచకప్‌లో, 2007 టీ20 ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌ బాధ్యతను మోసింది ప్రధానంగా యువీనే. అతడి పవర్‌ హిట్టింగ్‌, నిలకడ, గెలిపించాలన్న తపన, పోరాట పటిమి అసాధారణం. ఈ తరంలో యువీని భర్తీ చేసే ఆటగాడు కనిపించడం లేదు.

కేఎల్‌ రాహుల్‌లో అపారమైన ప్రతిభ ఉన్నా

కేఎల్‌ రాహుల్‌లో అపారమైన ప్రతిభ ఉన్నా

కేదార్‌ జాదవ్‌, మనీశ్‌ పాండే ఉన్నా నిలకడ లోపంతో బాధపడుతున్నారు. దినేశ్‌ కార్తీక్‌ను పరీక్షించినా అంతగా ఆకట్టుకోలేదు. కేఎల్‌ రాహుల్‌లో అపారమైన ప్రతిభ ఉన్నా అతడిని బ్యాకప్‌ ఓపెనర్‌గానే భావిస్తున్నారు. గంగూలీ ఎంత మొత్తుకున్నా చాలా మ్యాచుల్లో అతడి సేవలను వినియోగించుకోకుండా బెంచీకే పరిమితం చేస్తున్నారు.

1990ల నాటి టీమిండియా కష్టాలను

1990ల నాటి టీమిండియా కష్టాలను

జట్టు కూర్పు విషయానికి వచ్చేసరికి మిడిలార్డర్ సమస్య మొదటికొస్తోంది. ఓపెనర్లు అందించిన ఊపును వారు చివరి వరకు కొనసాగించడం లేదు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలోనూ ఇదే సమస్య కనిపించింది. ఆసియా కప్‌లోనూ అంతే. విండీస్‌ మ్యాచ్‌లో కోహ్లీతో కలిసి అంబటి రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత ఒక్కరూ విరాట్‌కు అండగా నిలబడని వైనం చూశాం. ఇదంతా చూస్తుంటే 1990ల నాటి టీమిండియా కష్టాలను గుర్తుచేస్తోంది.

2000-2010 మధ్యకాలంలోనే మిడిలార్డర్‌తో

2000-2010 మధ్యకాలంలోనే మిడిలార్డర్‌తో

ప్రపంచకప్‌నకు ఉన్న సమయం మరో ఏడు నెలలే. ఈ విరామంలో టీమిండియా 15 వన్డేలు మాత్రమే ఆడగలదు. ఆ లోపే కుదురుకోవాలి. 1990లో అజహరుద్దీన్‌, అజయ్‌ జడేజాలాంటి వారున్నా సచిన్‌, గంగూలీ ఓపెనింగ్‌ ఊపును నిలకడగా కొనసాగించలేకపోయారు. 2000-2010 మధ్యకాలంలోనే మిడిలార్డర్‌తో ఎలాంటి సమస్య లేదు. అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో వీవీఎస్‌ లక్ష్మణ్‌, మొహమ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌ సింగ్‌, ఎంస్‌ ధోనీ చివరి వరకు నిలిచి మ్యాచ్‌లను గెలిపించారు. ఇప్పుడు ధోనీ ఉన్నా కీపింగ్‌లో తప్ప బ్యాటింగ్‌లో మెరవడం లేదు.

Story first published: Friday, October 26, 2018, 9:43 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X