న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్రీదీకి అక్తర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతోన్న గంభీర్

Gautam Gambhir thanks Afridi and Akhtar for their gestures towards Amritsar tragedy victims

హైదరాబాద్: దసరా మిగిల్చిన పెను విషాదం పట్ల ఇప్పటికీ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా రైలు ప్రమాదంలో 62మంది మృత్యువాత పడిన సంఘటన దేశప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నివాళులు అర్పించారు. అయితే తాజాగా ఈ ఘటనపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ అక్తర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నిజంగా హృదయ విదారక ఘటన

నిజంగా హృదయ విదారక ఘటన

‘భారత్‌లో ఇది నిజంగా హృదయ విదారక ఘటన(అమృత్‌సర్‌లో రైలు ప్రమాదం). ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. వారికి ఆ భగవంతుడు తగినంత మనోధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను' అని పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ట్విటర్‌ ద్వారా పేర్కొన్నాడు.

వైజాగ్ వన్డేలో కుల్దీప్ గూగ్లీ బౌల్డ్ ఇదే(వీడియో)

అమృత్‌సర్‌ ఘటన బాధించిందని..

అమృత్‌సర్‌ ఘటన బాధించిందని..

అక్తర్‌ కూడా ‘అమృత్‌సర్‌ ఘటన తనను బాధించిందని.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు' ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ఇదిలా ఉండగా తాజాగా దీనిపై స్పందించిన భారత క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సదరు పాకిస్థాన్‌ క్రికెటర్లకు ట్విటర్‌ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

షోయబ్‌ అక్తర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

‘నాకు, అఫ్రిదికి మధ్య గతంలో కొన్ని వివాదాలు చోటుచేసుకొని ఉండొచ్చు. కానీ, అమృత్‌సర్‌లో బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించినందుకు అఫ్రిదిని నేను

ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కచ్చితంగా అతని ప్రకటనను ప్రతి ఒక్క భారతీయుడు ఆహ్వానిస్తాడని నేను నమ్ముతున్నా. షోయబ్‌ అక్తర్‌కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు' అని గంభీర్‌ ట్విటర్‌ ద్వారా బదులిచ్చాడు.

రంజీ ట్రోఫీలో మళ్లీ ఆడి సత్తా

రంజీ ట్రోఫీలో మళ్లీ ఆడి సత్తా

ఇప్పటికే గంభీర్‌కు దేశీవాలీ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లలో కలిపి కేవలం ఢిల్లీకి కెప్టెన్సీ వహించడమే కాదు. 518 పరుగులు కూడా నమోదు చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ హర్యానా మ్యాచ్‌లో గంభీర్ పలు సెంచరీలు నమోదు చేశాడు. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీలో మళ్లీ ఆడి తన సత్తా చాటనున్నాడు.

Story first published: Friday, October 26, 2018, 9:17 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X