న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమేశ్‌కు ఛాన్స్ దొరకలేదు, సొంతగడ్డపై సిరాజ్‌కు చోటు దక్కేనా?

Unfortunate Umesh Didnt Play Much Overseas, Siraj is a Quick Learner: Bharat Arun

హైదరాబాద్: విదేశాల్లో ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం పేసర్ ఉమేశ్ యాదవ్‌కి దక్కలేదని టీమిండియా బౌలింగ్‌ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. విండిస్‌తో రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 14 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.

ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్‌కి బదులుగా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌ని జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం టీమిండియా ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన భరత్ అరుణ్ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆటతీరు, జట్టులో పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంపై స్పందించారు.

భరత్ అరుణ్ మాట్లాడుతూ

భరత్ అరుణ్ మాట్లాడుతూ

భరత్ అరుణ్ మాట్లాడుతూ "దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ గడ్డపై దురదృష్టవశాత్తు ఉమేశ్ యాదవ్‌కి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించలేదు. దీనికి ప్రధాన కారణం.. జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ మెరుగ్గా రాణించడమే. అయితే.. ఈ ఇద్దరికీ టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇస్తే.. మొదట వినిపించే పేరు మాత్రం ఉమేశ్ యాదవ్‌దే" అని అన్నాడు.

ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించాల్సి వస్తోంది

ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించాల్సి వస్తోంది

"రొటేషన్‌ విధానం, మిగతా బౌలర్లు రాణిస్తుండటంతోనే ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించాల్సి వస్తోంది. ఈ రొటేషన్ పాలసీని అతను కూడా అర్థం చేసుకున్నాడు. అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పులో ప్రయోగాల గురించి పెద్దగా ఆలోచించడం లేదని, అందరికీ అవకాశాలిస్తూ, మంచి బృందాన్ని మైదానంలో దింపడమే లక్ష్యమని తెలిపాడు.

గత మ్యాచ్‌లో పృథ్వీ షాకు అవకాశం

గత మ్యాచ్‌లో పృథ్వీ షాకు అవకాశం

గత మ్యాచ్‌లో పృథ్వీ షాకు అవకాశం ఇచ్చినట్లు ప్రతి టెస్టుకు కొత్త ఆటగాళ్లను దింపగల వనరులు మనకు ఉన్నాయని తెలిపాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ గొప్ప ప్రతిభావంతుడని భవిష్యత్‌లో మనకు అద్భుత బ్యాట్స్‌మన్‌ అవుతాడని తెలిపాడు. అతడి సాంకేతిక లోపాలపై కోచ్‌లు రవిశాస్త్రి, సంజయ్‌ బంగర్‌లు రాహుల్‌తో మాట్లాడుతున్నట్లు తెలిపాడు.

 సిరాజ్‌పై బౌలింగ్ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ప్రశంసలు

సిరాజ్‌పై బౌలింగ్ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ప్రశంసలు

ఇక, హైదరబాదీ పేసర్‌ సిరాజ్‌పై కోచ్‌ భరత్‌ అరుణ్‌ ప్రశంసలు కురిపించాడు. సొంతగడ్డపై శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న రెండో టెస్టులో అతడిని ఆడించే విషయమై స్పష్టత ఇవ్వకున్నా, అతడు చాలా వేగంగా నేర్చుకుంటున్నాడని కొనియాడాడు. "గతంలో హైదరాబాద్‌ రంజీ కోచ్‌గా పనిచేసిన నా అనుభవంతో, భారత్‌ ‘ఎ' జట్టు తరఫున ఇటీవలి సిరాజ్‌ ప్రదర్శన చూసి చెబుతున్నా. అతడు చాలాచాలా త్వరగా నేర్చుకునే క్రికెటర్‌" అని భరత్ అరుణ్ అన్నాడు.

Story first published: Thursday, October 11, 2018, 10:21 [IST]
Other articles published on Oct 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X