న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యార్కర్స్, స్లో బంతులను ఎలా సంధిస్తున్నాడో నమ్మశక్యంగా లేదు: బుమ్రాపై మలింగ

Unbelievable how he executes yorkers & slow balls: Malinga lauds Bumrah


హైదరాబాద్: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అదే ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు. ఆ తర్వాత 2019లో ఆటగాడిగా మళ్లీ ముంబై తరఫున బరిలోకి దిగాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో చివరగా శార్దూల్‌ ఠాకూర్‌ను మలింగ ఔట్ చేయడంతో ముంబై నాలుగోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, 2013 నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న బుమ్రా ప్రపంచ స్థాయి ఆటగాడిగా పరిణితి చెందడంలో లసిత్ మలింగ పాత్ర ఉందనడంలో ఎటువంటి సందేహాం లేదు.

డేవిస్ కప్‌: భారత్ చేతిలో పాక్ చిత్తు, 44 విజయాలతో లియాండర్ పేస్ రికార్డు!</a></strong><a class=" title="డేవిస్ కప్‌: భారత్ చేతిలో పాక్ చిత్తు, 44 విజయాలతో లియాండర్ పేస్ రికార్డు!" />డేవిస్ కప్‌: భారత్ చేతిలో పాక్ చిత్తు, 44 విజయాలతో లియాండర్ పేస్ రికార్డు!

వచ్చే ఐపీఎల్‌లో కూడా ముంబైకే

వచ్చే ఐపీఎల్‌లో కూడా ముంబైకే

వచ్చే ఐపీఎల్‌లో కూడా వీరిద్దరూ ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్‌ మలింగ పొగడ్తలతో ముంచెత్తాడు. లసిత్ మలింగ మాట్లాడుతూ "బుమ్రాకి బౌలింగ్‌లో సాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను" అని చెప్పాడు.

బుమ్రా వరల్డ్ NO.1 బౌలర్

బుమ్రా వరల్డ్ NO.1 బౌలర్

"ప్రస్తుతం బుమ్రా వరల్డ్ NO.1 బౌలర్. అతని కెరీర్‌లో నా సహకారాన్ని గుర్తించేలా చిట్కాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని మరియు నైపుణ్యాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవాలి. అప్పుడు క్రికెట్‌ విజేతగా నిలుస్తుంది" అని లసిత్ మలింగ్ వెల్లడించాడు.

పరిస్థితుల్ని బట్టి

పరిస్థితుల్ని బట్టి

"పరిస్థితుల్ని బట్టి బ్యాట్స్‌మెన్‌కు బంతుల్ని సంధించడంలో బుమ్రాకు నా కన్నా మంచి ఎంపిక ఉంటుంది. అతను పొందే అన్ని సలహాలను మైదానంలో సమర్ధవంతంగా అమలు చేయగలడు. అతడు వేసే యార్కర్లు, నెమ్మది బంతులే దీనికి ఉదాహరణ. అతని బౌలింగ్‌ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది" అని అన్నాడు.

Australia vs Pakistan: ట్రిపుల్ సెంచరీ సెంచరీతో డేవిడ్ వార్నర్ సాధించిన రికార్డులివే!

యార్కర్లను ఎలా సంధిస్తున్నాడో

యార్కర్లను ఎలా సంధిస్తున్నాడో

"బుమ్రా అంత కఠినమైన యార్కర్లను ఎలా సంధిస్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో. బౌలింగ్‌లో మరిన్ని మెలకువులు నేర్చుకోవడానికి అతడు ఎప్పుడూ ముందుంటాడు" అని తెలిపాడు. సీనియర్‌ క్రికెటర్లు యువ క్రికెటర్లకు సూచనలు ఇవ్వాల్సిన అవరసం ఉందని మలింగ తెలిపాడు.

Story first published: Saturday, November 30, 2019, 17:15 [IST]
Other articles published on Nov 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X