న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేటు పడింది..: యాషెస్‌లో నాలుగు, ఐదు టెస్టులకు అంఫైర్లు మార్పు

Umpires Joel Wilson, Chris Gaffaney out of Ashes 2019 after howlers

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో లీడ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో పేలవ అంఫైరింగ్ చేసిన అంఫైర్లు జోయెల్ విల్సన్, క్రిస్ గఫానీ‌లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ సిరిస్‌లో మిగిలిన రెండు టెస్టుల నుంచి వీరిద్దరినీ తప్పించింది.

న్యూజిలాండ్‌కు చెందిన జోయెల్ విల్సన్ యాషెస్ మూడో టెస్టులో 7 తప్పుడు నిర్ణయాలు తీసుకోగా... క్రిస్ గఫానీ అయితే ఏకంగా 8 తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఎడ్జిబాస్టన్‌లో సైతం క్రిస్ గఫానీ డీఆర్ఎస్‌లో పొరపాటుపడ్డారు.

మండిపడ్డ ఫ్యాన్స్: స్టోక్స్‌తో పోల్చి సచిన్‌ను తక్కువ చేస్తూ ఐసీసీ ట్వీట్మండిపడ్డ ఫ్యాన్స్: స్టోక్స్‌తో పోల్చి సచిన్‌ను తక్కువ చేస్తూ ఐసీసీ ట్వీట్

ఇక, మూడో టెస్టులో అంఫైర్ జోయెల్ విల్సన్ తీసుకున్న ఓ నిర్ణయం మ్యాచ్ విజేతనే మార్చివేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో బెన్ స్టోక్స్ జట్టుకు విజయాన్ని అందించాడు.

11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో

11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో

11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. నిజానికి మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాలి. అయితే, ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్ నిర్ణయం తప్పిదమో లేక స్పిన్నర్ లియాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్‌ను దురదృష్టం వెంటాడింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయానికి ఆరు పరుగులు అవసరం. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది.

స్టోక్స్ ఔటయ్యేవాడు

స్టోక్స్ ఔటయ్యేవాడు

ఈ క్రమంలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన బంతి నేరుగా వెళ్లి బెన్ స్టోక్స్ ప్యాడ్లను తాకింది. స్టోక్స్‌ ఎల్బీ కోసం లయాన్‌ చేసిన అప్పీల్‌ను అంపైర్‌ విల్సన్‌ తిరస్కరించాడు. అప్పటికీ ఆస్ట్రేలియా రివ్యూలు అయిపోవడంతో బెన్ స్టోక్స్‌ బ్రతికి పోయాడు. అయితే, బంతి మిడిల్‌ వికెట్‌కు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. ఆస్ట్రేలియాకు రివ్యూ గనుక ఉండి ఉంటే స్టోక్స్ ఔటయ్యేవాడు. నిజానికి రివ్యూలో బెన్ స్టోక్స్ ఔట్ అని తేలినప్పటికీ ఫీల్డ్ అంపైర్ జోయెల్ విల్సన్ నాటౌట్‌గా ప్రకటించడంతో థర్డ్ అంఫైర్ కూడా ఏం చేయలేకపోయాడు.

కమ్మిన్స్ వేసిన ఓవర్‌లో

కమ్మిన్స్ వేసిన ఓవర్‌లో

ఆ తర్వాత ప్యాట్ కమ్మిన్స్ వేసిన ఓవర్‌లో బెన్ స్టోక్స్ ఫోర్ బాది ఇంగ్లాండ్‌కు విజయాన్నందించాడు. అలా కాకుండా బెన్ స్టోక్స్‌ను ఫీల్డ్ అంఫైర్ ఔట్‌గా ప్రకటించి ఉంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించేది. అంఫైరింగ్ తప్పిదాలతో యాషెస్ మూడో టెస్టు ఫలితం తారుమారు కావడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా

ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా

ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ఫీల్డ్ అంఫైర్లుగా మరైస్ ఎరాస్మస్, రుచిరా పల్లియగురుగేలను ఎంపిక చేయగా... శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన థర్డ్ అంఫైర్‌గా వ్యవహారించనున్నారు. ఇక, ఓవల్ వేదికగా జరగనున్న ఐదో టెస్టుకు మరైస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంఫైర్‌గా కొనసాగుతాడు.

డీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన బీసీసీఐ

డీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన బీసీసీఐ

మరోవైపు రుచిరా పల్లియగురుగే, కుమార ధర్మసేన వారి వారి స్థానాలను మార్చుకుంటారని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన అనంతరం బెన్ స్టోక్స్ మాట్లాడుతూ డీఆర్ఎస్ పూర్తిగా తప్పని తేలిందని అన్నారు. నిజానికి బీసీసీఐ కూడా చాలా ఏళ్ల పాటు ఈ డీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, August 28, 2019, 17:25 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X