న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్ బక్నర్ ప్రపంచ రికార్డుని సమం చేసిన పాక్ అంఫైర్

Umpire Aleem Dar equals Steve Bucknor world record

హైదరాబాద్: పాకిస్థాన్ అంపైర్‌ అలీమ్‌ దార్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసిన వెస్టిండిస్ అంఫైర్ స్టీవ్ బక్నర్ రికార్డుని సమం చేశాడు. ఇప్పటివరకూ స్టీవ్‌ బక్నర్‌ 128 టెస్టు మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇప్పుడు ఆ రికార్డుని 51 ఏళ్ల అలీమ్‌ దార్‌ సమం చేశారు.

<strong>కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌</strong>కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌

లార్డ్స్ వేదికగా రెండో టెస్టు

లార్డ్స్ వేదికగా రెండో టెస్టు

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. నిజానికి ఈ టెస్టు బుధవారమే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా తొలిరోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజైన గురువారం ఆట ప్రారంభం కావడంతో అలీమ్‌ దార్‌ ఈ మైలురాయిని అందుకున్నారు.

అలీమ్ దార్‌కు అభినందనలు

ఈ మేరకు ఐసీసీ తన ట్విట్టర్‌లో అలీమ్ దార్‌కు అభినందనలు తెలిపింది. దీనిపై అలీమ్‌ దార్ మాట్లాడుతూ ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. తన రోల్‌ మోడల్‌ బక్నర్‌ సరసన నిలవడం ఇంకా ఆనందంగా ఉందని అలీమ్ దార్ తెలిపాడు. ఈ ఘనత సాధించడానికి ఆ దేవుడి సాయంతో పాటు ఐసీసీ, పీసీబీల సహకారం కూడా మరువలేనిదని అన్నాడు.

కృతజ్ఞతలు తెలియజేసిన అలీమ్ దార్

కృతజ్ఞతలు తెలియజేసిన అలీమ్ దార్

ఈ సందర్భంగా తన సహచరులకు, తన కోచ్‌లకు అలీమ్‌ దార్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సహకారం వెలకట్టలేనిదని, వారు నుంచి తనకు సహకారం అందకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పుకొచ్చాడు. 2003లో ఢాకాలో ఇంగ్లాండ్‌-బంగ్లా జట్ల మధ్య జరిగిన టెస్టుతో అంపైర్‌గా అలీమ్‌ దార్‌ అరంగేట్రం చేశాడు.

376 మ్యాచ్‌లకు అంపైరింగ్‌

376 మ్యాచ్‌లకు అంపైరింగ్‌

అలీమ్‌ దార్‌ ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 376 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశాడు. ఇదిలా ఉంటే, యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలిరోజే తేలిపోయింది. ఆస్ట్రేలియా పేసర్లు హాజెల్‌వుడ్‌ (3/58), కమిన్స్‌ (3/61)తో పాటు స్పిన్నర్‌ లయన్‌ (3/68) చెలరేగడంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 77.1 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Friday, August 16, 2019, 10:23 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X