న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమేశూ.. బంగారం ధరల కన్నా నీ పరుగులే ఎక్కువగా ఉన్నాయి కదయ్యా!!

Umesh Yadav’s overs are more expensive than gold prices says Aakash Chopra

ముంబై: ఐపీఎల్‌ 2020లో భాగంగా గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు మురుగన్ అశ్విన్ (3/21)‌, రవి బిష్ణోయ్‌ (3/32).. పేసర్ షెల్డన్‌ కాట్రెల్‌ (2/17) అద్భుత ప్రదర్శన చేయడంతో కింగ్స్ పంజాబ్ 97 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. పంజాబ్ బౌలర్ల దెబ్బకు బెంగళూరు 109 పరుగులకే ఆలౌటైంది. అయితే ఆ మ్యాచులో భారీగా పరుగులు సమర్పిచుకున్న టీమిండియా సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సెటైర్లు వేశాడు.

నీ పరుగులు బంగారం ధర కంటే ఎక్కువ:

నీ పరుగులు బంగారం ధర కంటే ఎక్కువ:

ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. అతడు ఇచ్చిన పరుగులు.. ఈ మధ్య కాలంలో బంగారం రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. లెగ్‌స్టంప్‌ దిశగా ఉమేష్ వేసిన బంతులకు దీపావళికి వచ్చే బహుమతుల కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. ఒక ఇండియా సీనియర్ బౌలర్‌గా ఉమేష్ నుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నాం. కానీ అతడు ఏమాత్రం ఆకట్టుకోవట్లేదు' అని అన్నాడు. ఉమేష్ 3 ఓవర్లలో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. అంతేకాక ఓ నో బాల్, వైడ్ కూడా వేశాడు.

కోహ్లీ సరైన సమయంలో బౌలర్లను ఉపయోగించుకోలేదు:

కోహ్లీ సరైన సమయంలో బౌలర్లను ఉపయోగించుకోలేదు:

'బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లను సరైన సమయంలో ఉపయోగించుకోలేదు. నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్‌ను ఉపయోగించిన విధానం అస్సలు బాలేదు. కేఎల్ రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, గ్లెన్ మాక్స్‌వెల్‌ ఇంకా క్రీజులోకి రాలేదు. అయినా ప్రధాన బౌలర్ల కోటను పూర్తిచేశాడు. చివరి ఏడు ఓవర్లలో సైనీ, చహల్ వేసింది కేవలం ఒక్కో ఓవర్ మాత్రమే. రాహుల్ బ్యాటింగ్ అద్భుతం. 132 స్కోర్ ఐపీఎల్ చరిత్రలో ఓ కెప్టెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు నా హృదయాన్ని గెలుచుకున్నాడు' అని ఆకాష్ చోప్రా తెలిపాడు.

మహీ ఇలా చేయడం ఇదే తొలిసారి:

మహీ ఇలా చేయడం ఇదే తొలిసారి:

శుక్రవారం ఢిల్లీతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత చెన్నై జట్టు ఆటతీరుతో పాటు ఎంఎస్ ధోనీ గురించి ఆకాశ్‌ చోప్రా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీ కేవలం ఐదుగురు బౌలర్లతోనే పూర్తి ఓవర్లు వేయించాడు. నాకు తెలిసి మహీ ఇలా చేయడం ఇదే తొలిసారి. సహజంగా అతడు ఐదుగురితో బౌలింగ్‌కు ఇష్టపడడు. కానీ ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారితోనే పూర్తి కోటా కానిచ్చేస్తున్నాడు. టాపార్డర్‌లో అంబటి రాయుడు లాంటి ఆటగాడు మిస్‌ అవడం, రాయుడు స్థానంలో వచ్చిన రుతురాజ్‌ అంతగా ఆకట్టుకోలేకపోవడం, మరో ఓపెనర్‌ విజయ్‌ మురళి పరుగులు చేయకపోవడంతో అదనపు బ్యాట్స్‌మన్‌ కోసం మహీ ఆరుగురితో బౌలింగ్‌ చేయించలేకపోతున్నాడు' అని భారత మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.

టాపార్డర్‌ మీద నమ్మకం లేక:

టాపార్డర్‌ మీద నమ్మకం లేక:

'గతంలో వాట్సన్‌ను లేదా జాదవ్‌తో పార్ట్‌ టైం బౌలింగ్‌ చేయించే మహీ ఈసారి మాత్రం దానికి మొగ్గు చూపడంలేదు. ఈ సీజన్‌లో జడేజా కూడా బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో 40కి పైగా పరుగులు ఇచ్చాడు. చావ్లా, జడేజా స్పిన్‌ ద్వయం రాజస్తాన్‌తో మ్యచ్‌లో 95 పరుగులు, ఢిల్లీతో మ్యాచ్‌లో 77 పరుగులు ఇచ్చాడు. అయినా ధోనీ మాత్రం పార్ట్‌టైం బౌలర్లను వినియోగించడానికి ఇష్టపడడం లేదు. బహుశా టాపార్డర్‌ మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం, మిడిల్‌ ఆర్డర్‌లో మరో అదనపు బ్యాట్స్‌మన్‌ కోసం మహీ వారిపై బౌలింగ్‌ ద్వారా ఒత్తిడి పడకూడదని అనుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు' అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

Story first published: Saturday, September 26, 2020, 15:49 [IST]
Other articles published on Sep 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X