న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీసీబీ సంచలన నిర్ణయం.. స్టార్ క్రికెటర్‌పై సస్పెన్షన్ వేటు!!

Umar Akmal suspended by PCB under Anti-Corruption Code ahead of PSL 2020

కరాచి: పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ క్రికెటర్‌ ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పీసీబీ అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అక్మల్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు పీసీబీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు ఉమర్ అక్మల్ ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేదు.

<strong>ఆ వార్తలన్నీ పచ్చి అబద్ధం.. క్లారిటీ ఇచ్చేసిన యువరాజ్‌!!</strong>ఆ వార్తలన్నీ పచ్చి అబద్ధం.. క్లారిటీ ఇచ్చేసిన యువరాజ్‌!!

సస్పెన్షన్ వేటు

సస్పెన్షన్ వేటు

ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై భవిష్యతులో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు అని పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవల ఫిట్‌నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. లాహార్‌లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన అక్మల్.. అక్కడి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.

మిస్బావుల్‌ హక్‌ హస్తం:

మిస్బావుల్‌ హక్‌ హస్తం:

ఉమర్ అక్మల్‌ ఈ ఘటనపై తాజాగా క్షమాపణలు చెప్పడంతో అతనిపై ఎటువంటి నిషేధం విధించడం లేదని పీసీబీ ప్రకటించింది. అయితే అక్మల్ చర్యలపై పాక్ ప్రధాన కోచ్‌ మిస్బావుల్‌ గుర్రుగా ఉన్నాడట. అక్మల్‌పై చర్యలు తీసుకోవడం వెనుక మిస్బా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

శ్రీలంక సిరీస్‌లో విఫలం:

శ్రీలంక సిరీస్‌లో విఫలం:

గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్‌లో అక్మల్‌ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం నుండి పీఎస్‌ఎల్‌ ఆరంభం కానుంది.

తికమక పడ్డ అక్మల్:

తికమక పడ్డ అక్మల్:

తాజాగా అక్మల్ ఓ ట్వీట్‌ చేసి నవ్వుల పాలయ్యాడు. ఇంగ్లిష్‌లో అంతగా ప్రావీణ్యం లేని అక్మల్‌.. పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌తో దిగిన ఫొటోను ట్వీటర్‌లో జత చేసి 'Mother from another Brother' అని రాసుకొచ్చాడు. 'Brother from another Mother' అని రాయబోయి తికమక పడ్డాడు. మొత్తానికి రజాక్‌ను అమ్మను చేసాడు. నెటిజన్లు అతనిపై సెటైర్ల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న అక్మల్.. ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు.

Story first published: Thursday, February 20, 2020, 13:49 [IST]
Other articles published on Feb 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X