న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విలియమ్సన్‌ ఆట అద్భుతం.. మిగతావారి కంటే అతడి బ్యాటింగ్‌ భిన్నం: కోహ్లీ

U-19 World Cup: Virat Kohli remembers U19 days, says Kane Williamson was a stand-out player in 2008

ముంబై: 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో అప్పటి న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆట అద్భుతం. మిగతా బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్‌ భిన్నంగా ఉండేదని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోని యువ టీమిండియా 2008 అండర్‌-19 టోర్నీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెమీస్‌లో కివీస్‌ను మట్టికరిపించిన కోహ్లీసేన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.

<strong>వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా ధోనీ.. టెస్ట్ సారధిగా కోహ్లీ!!</strong>వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా ధోనీ.. టెస్ట్ సారధిగా కోహ్లీ!!

కేన్‌ ఆట అద్భుతం

కేన్‌ ఆట అద్భుతం

అప్పటి జ్ఞాపకాలను బుధవారం ఐసీసీ ఇంటర్వ్యూలో కోహ్లీ మరోసారి గుర్తు చేసుకుని కేన్‌ను ప్రశంసించాడు. 'విలియమ్సన్‌ను ఎదుర్కోవడం నాకు ఇప్పటికి గుర్తుంది. కివీస్ జట్టుకు అండగా నిలబడేవాడు. మిగతా బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే అతడి బ్యాటింగ్‌ సామర్థ్యం భిన్నంగా ఉండేది. కేన్‌ ఆట అద్భుతం. కేన్‌, స్టీవ్‌ స్మిత్‌ సహా ఆ ప్రపంచకప్‌ ఆడినవారిలో చాలామంది ప్రస్తుతం తమ తమ దేశాలకు ఆడుతున్నారు. నేను కూడా' అంటూ కోహ్లీ తెలిపాడు.

నా హృదయంలో ప్రత్యేకమైన చోటు

నా హృదయంలో ప్రత్యేకమైన చోటు

'ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ నా కెరీర్లో ముఖ్యమైన మైలురాయి. కెరీర్‌ను నిర్మించుకొనేందుకు ఆ మెగా టోర్నీ ఎంతో ఉపయోగపడింది. అందుకే నా హృదయం, మనసులో దానికి ప్రత్యేకమైన చోటుంది. అది ఇచ్చే అవకాశాన్ని గౌరవించడం, అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. రవీంద్ర జడేజా, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ కూడా 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ ఆడారు.

స్టోక్స్‌ ఇన్నింగ్స్ సూపర్

స్టోక్స్‌ ఇన్నింగ్స్ సూపర్

ఇక 2010 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ స్టార్ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జో రూట్‌ వెలుగులోకి వచ్చారు. భారత్‌పై స్టోక్స్‌ 88 బంతుల్లోనే 100 పరుగులు చేసిన విషయాన్నీ రూట్‌ గుర్తు చేసుకున్నాడు. 'టోర్నీ ఫేవరెట్‌ను ఓడించాచాం. ఆ సమయంలో చాలా ఆనందం వేసింది. భారత్‌పై స్టోక్స్‌ ఆడిన ఇన్నింగ్స్ సూపర్. అప్పటి సహచరులతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడటం బాగుంది' అని రూట్‌ పేర్కొన్నాడు.

Story first published: Thursday, January 2, 2020, 10:59 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X