క్రికెట్ స్టేడియంలో దారుణం: ఇద్దరు క్రికెట్ కోచ్‌ల హత్య!

Posted By:

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో ఉన్న లాడియమ్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇద్దరి కోచ్‌ల మృతదేహాలు లభ్యమవ్వడం సంచలనం రేపుతోంది. మృతులను గివెన్ (24), చార్ల్ సన్ (26)గా గుర్తించారు. మృతదేహాలపై గాయాలను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగానే ఎవరో హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం యథావిధిగా ప్రాక్టీసుకు వచ్చిన ఉమర్ అస్సద్ అనే క్రికెటర్ కోచ్‌లు పురుషుల బాత్‌రూమ్‌లో మరణించినట్టు గుర్తించి, వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో విషయం వెలుగు చూసింది. స్టేడియంలోని క్వార్టర్స్‌‌లో మొత్తం నలుగురు కోచ్‌లు నివసిస్తున్నారు.

Two cricket coaches found dead at Laudium cricket oval

వీరిలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా క్రికెట్‌ దక్షిణాఫ్రికా అనుబంధ కార్యక్రమాల్లో కూడా కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరి మృతి పట్ల క్రికెట్‌ దక్షిణాఫ్రికా బోర్డు సంతాపం ప్రకటించింది. నిందితులను వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.

Story first published: Friday, September 15, 2017, 13:59 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి