న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డేలో విండిస్ క్రికెటర్ షాయ్ హోప్ అరుదైన రికార్డు

Two Centuries for Shai Hope in his ODI career and incidentally both resulted in ties

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజా పంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. అనంతరం వెస్టిండిస్ జట్టు కూడా 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 321 పరుగులే చేసింది.

<strong>క్రికెట్‌లో ఇదో మంచి గేమ్: విశాఖ వన్డే ఫలితంపై విరాట్ కోహ్లీ</strong>క్రికెట్‌లో ఇదో మంచి గేమ్: విశాఖ వన్డే ఫలితంపై విరాట్ కోహ్లీ

భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ (4), శిఖర్ ధావన్ (29) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడితో కలిసి కోహ్లీ సెంచరీ (157 నాటౌట్)తో చెలరేగాడు. అనంతరం 322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి విండిస్ జట్టులో షాయ్ హోప్ (123 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మెయిర్ (94) రాణించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

1
44267
విశాఖ వన్డేలో షాయ్ హోప్ అరుదైన రికార్డు

విశాఖ వన్డేలో షాయ్ హోప్ అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌లో పది వేల పరుగులు పూర్తి చేయడంతోపాటు విరాట్ కోహ్లీ అనేక అరుదైన రికార్డులను అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే, అందరూ విరాట్ కోహ్లీ రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు... కానీ, తన అద్భుతమైన ఆటతీరుతో వెస్టిండిస్‌ను ఓటమి నుంచి తప్పించాడు విండిస్ ఆటగాడు షాయ్ హోప్.

సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్‌‌మెన్ షాయ్ హోప్‌

సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్‌‌మెన్ షాయ్ హోప్‌

ఈ క్రమంలో షాయ్ హోప్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో టైగా ముగిసిన రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్‌‌మెన్ షాయ్ హోప్‌ కావడం విశేషం. శ్రీలంక, జింజాబ్వే, విండీస్ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరిస్‌లో భాగంగా 2016లో బులవాయె వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో హోప్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ కూడా టైగానే ముగియడం విశేషం.

తాను ప్రత్యర్థిగా ఆడిన ప్రతీ జట్టుపై సెంచరీ నమోదు

తాను ప్రత్యర్థిగా ఆడిన ప్రతీ జట్టుపై సెంచరీ నమోదు

తాజా సెంచరీతో వన్డేల్లో అప్ఘనిస్తాన్, యూఏఈలతో ఒక్కో మ్యాచ్‌ ఆడిన కోహ్లీ... ఈ రెండు దేశాలు మినహా తాను ప్రత్యర్థిగా ఆడిన ప్రతీ జట్టుపై సెంచరీ నమోదు చేశాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగని కోహ్లీ, యూఏఈపై అజేయంగా 33 పరుగులు చేశాడు. ఇది మినహాయించి తాను ఆడిన 9 దేశాలపై కోహ్లీ సెంచరీలు సాధించాడు.

పదివేల పరుగుల మైలురాయిని 50కి పైగా సగటుతో

పదివేల పరుగుల మైలురాయిని 50కి పైగా సగటుతో

పదివేల పరుగుల మైలురాయిని 50కి పైగా సగటుతో అందుకున్న ఆటగాళ్లలో ఒకరు ధోని కాగా, మరొకరు విరాట్ కోహ్లీ. టీమిండియా గెలిచిన 128 మ్యాచ్‌లలో భాగంగా ఉన్న కోహ్లీ ఆ మ్యాచ్‌లలో 78.47 సగటుతో 7220 పరుగులు చేయగా... ఓడిన 73 మ్యాచ్‌లలో 35.61 సగటుతో 2564 పరుగులు చేశాడు.

Story first published: Thursday, October 25, 2018, 16:01 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X