న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ కీపర్ నిజం తెలిసినా అవుట్ అని వాదించాడు..!!

Twitterati slam Australian keeper Alex Carey after appealing for hit-wicket

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనను టీ20 సిరీస్‌తో మొదలుపెట్టిన టీమిండియా తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా జట్టును వరుణుడు కరుణించాడు. దానికి తోడు ముందుగా బ్యాట్స్‌మెన్‌ చేసిన స్కోరు జట్టుకు బాగా కలిసొచ్చింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించకపోయినా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయి ఆడారు.

కేవలం 4 పరుగుల 4 వికెట్లు తేడాతో

కేవలం 4 పరుగుల 4 వికెట్లు తేడాతో

ముఖ్యంగా మాక్స్‌వెల్‌(46), క్రిస్‌ లిన్‌(37), మార్కస్‌ స్టోయినిస్‌(33) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 17ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158పరుగులు సాధించింది. చివర్లో వర్షం రావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానం ప్రకారం.. మ్యాచ్‌ను 17ఓవర్లకు కుదించి భారత్‌ లక్ష్యాన్ని 174పరుగులుగా సవరించారు. చేధనలో పోరాడిన టీమిండియా ప్రధాన వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది. దీంతో కేవలం 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

రాహుల్ తానే బ్యాట్‌తో తాకినట్లు

టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి బంతి విసిరిన ఆదం జంపా.. కేఎల్ రాహుల్‌కు ఆఫ్ సైడ్‌లో బంతి వెళ్లి బేల్స్‌ను పడగొట్టింది. ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాళ్లంతా కేఎల్ రాహుల్ తానే బ్యాట్‌తో తాకినట్లు పొరబాటుపడ్డారు. కానీ, వికెట్ కీపింగ్ చేస్తున్న ఆసీస్ కీపర్‌కు మాత్రం యథార్థంగా జరిగిందేంటో తెలుసు. దానిని అవుట్ అని వాదించడంతో అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. బంతి రాహుల్ కాలిని కానీ, బ్యాట్‌ను కానీ తాకలేదు. బేల్స్‌కు సమీపంగా వెళ్లిందంతే.

తర్వాత రాహుల్‌కు ఫ్రీ హిట్

తర్వాత రాహుల్‌కు ఫ్రీ హిట్

వికెట్ కీపర్ గ్లోవ్స్ మాత్రమే బేల్స్‌కు తగలడంతో అవి కాస్తా కదిలాయి. అది చూడ్డానికి వృథా బాల్‌గా అనిపించడంతో అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత రాహుల్‌కు ఫ్రీ హిట్ లభించింది. కానీ, కాసేపటికే అంటే ఆ తర్వాతి బంతికే రాహుల్‌ను కీపర్ అలెక్స్ క్యారీ స్టంప్ అవుట్ చేశాడు. ఈ విషయాన్ని కూడా థర్డ్ అంపైర్ నుంచే రావడంతో రాహుల్ వెనుదిరగాల్సి వచ్చింది.

మైదానంలో నియమ నిబంధనలు లేకుండా

మైదానంలో నియమ నిబంధనలు లేకుండా

రాహుల్ అవుట్ అవకముందే దానిని అవుట్ అని ఫీల్డర్లకు పాటుగా మద్ధతు తెలిపిన అలెక్స్ క్యారీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అతని అంతర్జాతీయ మ్యాచ్‌ల అరంగ్రేటం ఎలా జరిగింది. ఈ క్రమంలోనే అతనిని మోసగాడంటూ తిడుతూ.. ఆస్ట్రేలియా జట్టును విమర్శిస్తున్నారు. మైదానంలో నియమ నిబంధనలు లేకుండా ప్రవర్తిస్తారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కొన్ని నెలల కిందట బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన అప్పటి ఆస్ట్రేలియా కెప్టన్ స్టీవ్ స్మిత్, వైస్ డేవిడ్ వార్నర్‌లు కూడా గుర్తు చేసుకుంటున్నారు.

Story first published: Thursday, November 22, 2018, 15:18 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X