న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు పాండ్యా అవసరమా?: నెటిజన్ల ఆగ్రహాం, విమర్శలు

By Nageshwara Rao
Twitters livid! Hardik Pandya slammed as India lose Test series in England

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మరో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే 3-1తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేనకు 27 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో తడబడటంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సిరీస్‌ చేజిక్కించుకోవడంలో టీమిండియా ఘోరంగా విఫలమైందని క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సిరిస్‌లో భారత జట్టు వైఫల్యంలో ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు టీమిండియాలో అతడిని ఎందుకు ఉంచాలో కారణం చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పాండ్యా ఆడిన ఆటపై మాజీ క్రికెట్ దిగ్గజం గవాస్కర్‌ విమర్శలు చేశాడు. "పాండ్యeను ఆల్‌ రౌండర్‌ అని పిలవాలని మీకుందా? అలా పిలవాలంటే ఎటువంటి అభ్యంతరం లేకుండా పిలవండి కానీ ఆయన నాకలా అనిపించడం లేదు" అని అన్నాడు.

1
42377

"టీమిండియాకు ధీటైన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ అవసరం. అంటే ఆరో స్థానంలో బలమైన వ్యక్తి ఉండాలి. కానీ పాండ్య అందుకు పనికిరాడు. ఈ విషయాన్ని టీమిండియా ఎప్పుడు తెలుసుకుంటుంది?" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

"ఒకప్పట్లో మిడిలార్డర్‌ నం.6లో లక్ష్మణ్‌లాంటి లెజెండరీ ఆటగాళ్లు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆస్థానంలో హార్దిక్‌ పాండ్యe ఉన్నాడు. ఆటకు కావల్సింది ప్రతిభ.. ఫ్యాషన్‌కాదు. ఈ విషయాలన్ని అందరూ త్వరగా గ్రహిస్తారని ఆశిస్తున్నా" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

"ఇంగ్లాండ్‌లో జరిగిన అన్ని టెస్టుల్లోనూ హార్దిక్‌ పాండ్య ఆడాడు. టీమిండియాలో అతని పాత్ర ఏంటి బ్యాట్స్‌మెనా? బౌలరా లేక షోస్టాపరా?" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

"ఇంగ్లండ్‌ జట్టులో బెన్‌స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కురాన్‌, మొయీన్‌ అలీ లాంటి ఆల్‌ రౌండర్లున్నారు. మరి భారత్‌లో? మనకు కూడా స్టార్‌ మోడల్‌ హార్దిక్‌ పాండ్య ఉన్నాడు. అతడు బ్యాటింగ్‌ చేసేటప్పుడు బౌలర్‌ లా కనిపిస్తాడు.బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌లా కనిపిస్తారు. ఆటలో అంత కన్ఫ్యూజన్‌ ఎందుకు?" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

"డియర్‌ పాండ్య.. క్రికెట్‌ ఆడటానికి నీకున్న ప్రతిభ ఏంటో చెప్పు, బౌలింగ్‌ రాదు. బ్యాటింగ్‌ చేతకాదు. ఆటకు సంబంధించి నీకున్న బలాల్లో అత్యంత బలమైనది ఏది? అసలు నిన్నెందుకు టీమిండియా ఉండనివ్వాలో ఒక్క కారణం చెప్పు" అని ఓ నెటిజన్ మరో ట్వీట్ చేశాడు.

Story first published: Monday, September 3, 2018, 20:00 [IST]
Other articles published on Sep 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X