న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీ.. తొలి టెస్టుకే కాదు.. పెర్త్‌కు కూడా అనుమానమే!!

Twitter reacts after Prithvi Shaw injures his ankle during the practice game

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు షాక్ ఎదురైంది. వార్టప్ టెస్టు మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా తలపడుతోంది. ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీ షా క్యాచ్ అందుకోబోయి పెను ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. బౌండరీ లైన వద్ద బంతిని చూస్తూ వెనక్కి జరగబోయేసరికి అతని ఎడమ కాలి చీలమండ మడతపడటంతో బాధతో విలవిలలాడిపోయాడు.

అప్రమత్తమైన సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేస్తుండగా మ్యాక్స్ బ్రియాంట్ బ్యాటింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కొట్టిన షాట్‌ను పృథ్వీ అందుకునేందుకు యత్నించి గాయానికి గురైయ్యాడు.

పృథ్వీకి సంఘీభావం తెలుపుతూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సీనియర్ క్రికెటర్లంతా ట్వీట్ల ద్వారా హితవు పలుకుతున్నారు.

దురదృష్టం. చాలా బాధాకరం. అడిలైడ్‌లో ఆడతాడని భావించిన షా గాయం కారణంగా దూరమైయ్యాడు. కాలి గాయంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెర్త్‌లో ఆడే టెస్టుకు సైతం అనుమానంగానే అనిపిస్తోంది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

పృథ్వీ షా హాస్పిటల్ నుంచి తిరిగొచ్చాడు. కాలికి కట్టుతో క్రచెస్ సాయంతో నడుస్తున్నాడు. తొలి టెస్టుకు ముందు ఇలా జరగడం భావ్యం కాదు. అధికారికంగా రావాల్సి ఉంది.

లేవగానే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. యువ క్రికెటర్ పృథ్వీ షా మూడో రోజు మ్యాచ్‌లో కాలికి గాయం అయింది. గాయం తీవ్రంగా జరిగినట్లు అనిపిస్తోంది. యువ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

Story first published: Friday, November 30, 2018, 16:35 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X