న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయుడు సాధించావ్‌: సచిన్ ప్రశంస, సెంచరీలపై ట్విట్టర్ రియాక్షన్స్

India Vs West Indies 2018,4th ODI: Twitter Reaction On Rohit and Ambati Rayudu’s Centuries| Oneindia
Twitter Reactions: Rohit Sharma and Ambati Rayudu’s centuries help India gain an unassailable lead

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్(54) ఒక్కడే ఫరవాలేదనిపించాడు.

గణాంకాలు: 4వ వన్డేలో రోహిత్ శర్మ నమోదు చేసిన రికార్డులివేగణాంకాలు: 4వ వన్డేలో రోహిత్ శర్మ నమోదు చేసిన రికార్డులివే

టెస్ట్ హోదా జట్లపై వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కాగా, మొత్తంగా మూడోది కావడం విశేషం. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది.

పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌లు చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఓపెనర్ రోహిత్ శర్మ (162), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (100) సెంచరీలు సాధించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచిన రోహిత్‌, రాయుడులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

రోహిత్‌..

రోహిత్‌.. నువ్వు సులువుగా సెంచరీలు సాధించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రాయుడు సాధించావ్‌.

వీవీఎస్ లక్ష్మణ్

భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలుత రోహిత్‌, రాయుడు బ్యాటింగ్‌తో అదరగొట్టారు. తర్వాతి ఇన్నింగ్స్‌లో యువ పేసర్‌ ఖలీల్‌ ఆకట్టుకున్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్

భారత్‌కు మంచి విజయం. రోహిత్‌, రాయుడు తమ బ్యాటింగ్‌తో కనువిందు చేశారు. బౌలర్లు కూడా చక్కగా ఆడారు. పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ చాలా తెలివిగా వ్యవహరించాడు.

మహ్మద్‌ కైఫ్‌

మంచి ఆల్‌రౌండర్‌ ప్రదర్శన. ఖలీల్‌ అహ్మద్‌ చాలా బ్రిలియంట్‌.

సురేశ్ రైనా

కంగ్రాట్స్‌ రోహిత్‌, రాయుడు. అద్భుత శతకాలు చేశారు. ఇలాగే కొనసాగించండి.

బ్రదర్‌ రోహిత్‌

గుడ్‌ వర్క్‌ బ్రదర్‌ రోహిత్‌. రాయుడు అద్భుతంగా ఆడాడు.

Story first published: Tuesday, October 30, 2018, 13:14 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X