ఒత్తిడిలో కూడా: బెన్ స్టోక్స్ సెంచరీపై క్రికెటర్లు ఏమన్నారు?

Posted By:

హైదరాబాద్: గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన పూణె ఆటగాడు బెన్ స్టోక్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సోమవారం పూణె వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పూణె 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్: బెన్ స్టోక్స్ సెంచరీ, గుజరాత్‌పై పూణె ఘన విజయం

ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో రూ. 14.5 కోట్లకు పూణె ప్రాంఛైజీ బెన్ స్టోక్స్‌ని కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు ఆ స్ధాయి మేరకు స్టోక్స్ రాణించలేదు. అయితే సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం స్టోక్స్ తానెంత విలువైన ఆటగాడో నిరూపించాడు.

Twitter Reactions: Ben Stokes century helps RPS achieve a thrilling run chase

'జట్టుకు గొప్ప విజయం. స్టోక్స్ బ్యాటింగ్ అద్భుతం. గ్రేట్ సెంచరీ' అని పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ట్వీట్ చేశాడు. రెండో ఓవర్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒత్తిడిలో కూడా బెన్ స్టోక్స్ టీ20 సెంచరీ చేశాడని గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొనియాడాడు.

'ఓ లెఫ్ట్ హ్యాండర్‌గా స్టోక్స్ ఆటను చూడటం గొప్పగా ఉంది. ప్రతిభ ఉన్న క్రికెటర్ అని సీరియస్ ఇన్నింగ్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు' అని యువరాజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌లో కామెంటేటర్‌గా ఉన్న కెవిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ కూడా స్టోక్స్ సెంచరీపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. 10 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోవడంతో రెండో ఓవర్లలో బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు.

38 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన స్టోక్స్ చివర్లో కండరాలు పట్టేసినా పట్టుదలతో ఆడి 61 బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఓ పక్క కీలక ఆటగాళ్లంతా అవుటైనప్పటికీ స్టోక్స్ నిలకడగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించాడు. మొత్తంగా స్టోక్స్ 63 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పుణె జట్టుకు గుజరాత్ లయన్స్‌పై ఇదే తొలి విజయం.

Story first published: Tuesday, May 2, 2017, 11:49 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి