న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్ సమం: మిర్పూర్ టెస్ట్‌లో బంగ్లాదేశ్ విజయం

Twitter Reactions: Bangladesh brush Zimbabwe aside to evade series-defeat

హైదరాబాద్: మిర్పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు 218 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-1తేడాతో సమం చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఓవర్ నైట్ స్కోరు 76/2తో చివరిరోజు ఇన్నింగ్స్‌ను

ఓవర్ నైట్ స్కోరు 76/2తో చివరిరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జింబాబ్వే 224 పరుగులకే ఆలౌటైంది. ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలువాలంటే ఇంకా 367 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అయితే, చివరిరోజు బంగ్లా బౌలర్లు విజృంభించడంతో జింబాబ్వే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్లుగా

ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో సీన్ విలియమ్స్‌(13) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరగా, ఆ తర్వాత తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో సికిందర్ రాజా(12) అతడికే నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన చాకబ్వా(2) పరుగులు చేయగా, తిరిపానో, మావుతా, చతుర పరుగులేమీ చేయకుండా వెనుదిరిగారు.

ఐదు వికెట్లు తీసిన మెహదీ హాసన్

ఐదు వికెట్లు తీసిన మెహదీ హాసన్

బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హాసన్ ఐదు వికెట్లు తీయగా, తైజూల్ ఇస్లాం రెండు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 522/7 వద్ద డిక్లేర్ చేయగా... జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు చేసి ఆలౌటైంది.

రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి ఆలౌట్

రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి ఆలౌట్

ఆ తర్వాత మహ్మదుల్లా (101 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 54 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 443 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Thursday, November 15, 2018, 15:24 [IST]
Other articles published on Nov 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X