న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ క్లీన్‌బౌల్డ్: మండిపడుతోన్న ఫ్యాన్స్ (వీడియో)

Twitter pounces on KL Rahul and Murali Vijay after yet another failure

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్లపై అభిమానులు మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ మరోసారి నిరాశపరిచాడు.

ఎవరా ఒక్క ప్లేయర్ అని అడిగిన చెన్నై ఫ్రాంచైజీ: యువీకే ఓటేసిన ఫ్యాన్స్ఎవరా ఒక్క ప్లేయర్ అని అడిగిన చెన్నై ఫ్రాంచైజీ: యువీకే ఓటేసిన ఫ్యాన్స్

ఈ మ్యాచ్‌లో స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో విఫలమైన మురళీ విజయ్ తాజాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లోనే మురళీ విజయ్ ఔటవడం గమనార్హం.

పెర్త్ టెస్టులో నిరాశపరిచిన కేఎల్ రాహుల్

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మురళీ విజయ్(11, 18) పరుగులతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సేపటికే భారత్‌ కేఎల్ రాహుల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 48 పరుగులే చేసిన కేఎల్ రాహుల్.. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ 2 పరుగులకే ఔటయ్యాడు.

మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హేజిల్‌వుడ్‌కే వికెట్ ఇచ్చిన రాహుల్

ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్‌కే ఈ ఓపెనర్ వికెట్ ఇవ్వడం గమనార్హం. అడిలైడ్‌ టెస్టులో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతుల్ని వెంటాడుతూ ఔటైన కేఎల్ రాహుల్.. పెర్త్ టెస్టులో యార్కర్ బంతిని ఆడలేక క్లీన్‌బౌల్డయ్యాడు. పాదాలకి సమీపంలో పడిన బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి లెగ్, మిడిల్ స్టంప్‌లను గీరాటేసింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ ఆరంభంలో విఫలమైన కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టులో సెంచరీతో రాణించాడు. విండిస్‌తో ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సెలక్టర్లు అవకాశమివ్వగా మళ్లీ విఫలమయ్యాడు.

కేఎల్ రాహుల్‌కి ఇంకెన్ని అవకాశాలిస్తారంటూ?

ఈ ఓపెనర్‌కి ఇంకెన్ని అవకాశాలు ఇస్తారంటూ? బీసీసీఐ, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానులు మండిపడుతున్నారు. పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన శనివారం టీ విరామానికి టీమిండియా 70/2 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (37), పుజారా (23) పరుగులతో ఉన్నారు.

Story first published: Saturday, December 15, 2018, 13:43 [IST]
Other articles published on Dec 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X