న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖలీల్ చేతికి ట్రోఫీ: ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

Twitter lauds MS Dhoni’s gesture to let Khaleel Ahmed hold the Asia Cup trophy

హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ ఈ టోర్నీ అసాంతం కెప్టెన్‌గా వ్యవహారించాడు.

ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసిన వేళ హరీశ్ సొహైల్ ఏం చేశాడంటే!ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసిన వేళ హరీశ్ సొహైల్ ఏం చేశాడంటే!

అయితే, ఫైనల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించిన అనంతరం ఒక విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుండటమే.

ఖలీల్‌ అహ్మద్ చేతుల్లో ఆసియాకప్ ట్రోఫీ

ఆసియా కప్‌ గెలిచిన సందర్భంగా సంబరాల సమయంలో కొత్త కుర్రాడు ఖలీల్‌ అహ్మద్ చేతుల్లో ట్రోఫీ ఉన్న సంగతి తెలిసిందే. ధోని సూచన మేరకే అతడికి చేతికి ట్రోఫీ వచ్చిందట. ఆ విషయాన్ని ఖలీలే స్వయంగా వెల్లడించాడు.

రోహిత్‌కు ధోనినే చెప్పాడు

"వేదిక మీద ట్రోఫీ నా చేతికి ఇవ్వమని కెప్టెన్‌ రోహిత్‌కు ధోనినే చెప్పాడు. ఇదే నాకు అరంగేట్ర సిరీస్‌. జట్టులో అందరి కంటే జూనియర్‌ నేనే కావడంతో ట్రోఫీ నా చేతికి ఇప్పించాడు. అది నాకు మరపురాని అనుభవం" అని ఖలీల్‌ చెప్పాడు.

తన కెప్టెన్సీలో ఎప్పుడు ట్రోఫీలను నెగ్గినా

ధోని కెప్టెన్సీలో సైతం ఇలానే వ్యవహారిస్తాడు. తన కెప్టెన్సీలో ఎప్పుడు ట్రోఫీలను నెగ్గినా... ధోని దానిని నేరుగా యువ ఆటగాళ్ల చేతికి అందిస్తాడు. ఆసియాకప్ టోర్నీలో ధోని కెప్టెన్ కాకపోయినప్పటికీ, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మకు చెప్పి మరీ యువ ఆటగాళ్లకు ట్రోఫీని అందించడంలో సఫలమయ్యాడు.

ధోనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధోనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ ఖలీల్ అహ్మద్ ట్రోఫీని పైకెత్తడం యువ ఆటగాళ్లను ప్రోత్సహించడమే అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 9, 2018, 19:33 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X