న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌పై అఫ్గాన్‌ విజయం.. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు బద్దలు

Tri-series, 3rd T20I: Mohammad Nabi, Mujeeb Ur Rahman shine Afghanistan to historic win over Bangladesh

ఢాకా: ముక్కోణపు టీ20 సిరీస్‌లో పసికూన అఫ్ఘనిస్థాన్ అద్భుత ఆటతో దూసుకెళుతోంది. శనివారం జింబాబ్వేతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న అఫ్గాన్‌.. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో అఫ్గానిస్తాన్‌ పొట్టి ఫార్మాట్‌లో విజయాలతో దూసుకెళుతోంది. అఫ్గాన్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్ తమ 12వ విజయంతో టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది.

<strong>మాజీ కెప్టెన్‌కు హెచ్‌ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!</strong>మాజీ కెప్టెన్‌కు హెచ్‌ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!

40 పరుగులకే నాలుగు వికెట్లు:

40 పరుగులకే నాలుగు వికెట్లు:

మొదటగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (0), హజ్రతుల్లా జజాయ్ (1) పూర్తిగా నిరాశపరిచారు. ఇక నజీబ్ తారకై (11)తో కలిసి అస్గర్ ఆఫ్ఘన్ (40) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టె సమయంలో తారకై పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన నజీబుల్లా జద్రాన్ (5) తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ కష్టాల్లో పడింది.

భారీ షాట్లతో విరుచుకుపడ్డ నబీ:

భారీ షాట్లతో విరుచుకుపడ్డ నబీ:

ఈ సమయంలో అస్గర్‌కు తోడు మొహమ్మద్ నబీ (54 బంతుల్లో 84 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్స్‌ లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ జోడి రాణించడంతో అఫ్గాన్‌ పోరాడే స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ముజీబ్ (4/15), రషీద్ ఖాన్ (2/23), నబీ (2/27) ధాటికి బంగ్లా 19.5 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాట్స్‌మన్‌ మహ్ముదుల్లా (44) టాప్ స్కోరర్. నబీకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరుగనుంది.

జింబాబ్వేపై విజయం:

జింబాబ్వేపై విజయం:

శనివారం జింబాబ్వేతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నజీబుల్లా జద్రాన్ (30 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మొహమ్మద్‌ నబీ (18 బంతుల్లో 38; 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అఫ్ఘనిస్థాన్ 28 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్ఘనిస్థాన్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులకే పరిమితమైంది. బ్రెండన్ టేలర్ (27), రెగిస్ చకబ్వా (42) పరుగులు చేశారు. రషీద్ ఖాన్ (2/29), ఫరీద్ (2/35) తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, September 16, 2019, 9:58 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X