న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లాష్‌బ్యాక్ 2018: ఈ ఏడాది అరంగేట్రం చేసిన టాప్-5 బౌలర్లు వీళ్లే

Top 5 ODI Debutants in 2018

హైదరాబాద్: ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌‌లో బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని మినహాయిస్తే అంతా సవ్యంగానే సాగింది. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో పలువురు కొత్త క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయమయ్యారు.

రోహిత్‌కు రెండు లైఫ్‌లు: చేతిలో పడిన క్యాచ్ మిస్ చేశాడు (వీడియో)రోహిత్‌కు రెండు లైఫ్‌లు: చేతిలో పడిన క్యాచ్ మిస్ చేశాడు (వీడియో)

ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్స్ పెరగడంతో చాలా మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అందులో పలువురు తమ జాతీయ జట్ల తరుపున వన్డేల్లో అరంగేట్రం చేశారు. అలా ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన వన్డే ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దామా!

షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్)

షాహిన్ అఫ్రిది (పాకిస్థాన్)

పాకిస్థాన్ తరుపున ఈ ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 6 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన షాహిన్ అఫ్రిది 13 వికెట్లు తీశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సత్తా ఉన్న షాహిన్ అఫ్రిది పాక్ తరుపున మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు పాక్ తరుపున ఏడు టీ20లాడిన షాహిన్ 18.45 యావరేజితో 11 వికెట్లు తీశాడు. ఇటీవలే న్యూజిలాండ్ గడ్డపై అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన అతడు మూడు వికెట్లు తీశాడు. రాబోయే రోజుల్లో పాక్ పేస్ బౌలింగ్ దళంలో షాహిన్ అఫ్రిది కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా)

లుంగి ఎంగిడి (దక్షిణాఫ్రికా)

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పేసర్ ఈ ఏడాది అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాతో తన తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. దక్షిణాఫ్రికా తరుపున మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 13 వన్డే మ్యాచ్‌లాడిన లుంగి ఎంగిడి 22.03 యావరేజితో 26 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది మొదట్లో భారత జట్టుపై అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసన లుంగి ఎంగిడి నాలుగు టెస్టుల్లో 19.53 యావరేజితో 15 వికెట్లు తీశాడు. తద్వారా అరంగేట్రం చేసిన టెస్టు సిరిస్‌లో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో సఫారీ జట్టు తరుపున లుంగి ఎంగిడి స్టార్ ప్లేయర్ కానున్నాడు.

ఖలీల్ అహ్మద్ (ఇండియా)

ఖలీల్ అహ్మద్ (ఇండియా)

జహీర్ ఖాన్ తర్వాత టీమిండియాకు దొరికిన అత్యుత్తమ ఎడమ చేతివాటం పేసర్. ఆసియాకప్ టోర్నీలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియాకప్ టైటిల్ విజేతగా నిలిచిందంటే అందుకు కారణం ఖలీల్ అహ్మద్. ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లాడిన ఖలీల్ అహ్మద్ 11 వికెట్లు తీశాడు. రాబోయే రోజుల్లో భారత పేస్ బౌలింగ్ దళంలో ఖలీల్ కీలక సభ్యుడైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఆండ్రూ టై (ఆస్ట్రేలియా)

ఆండ్రూ టై (ఆస్ట్రేలియా)

స్పెషలిస్ట్ థర్డ్ పేసర్‌గా ఆండ్రూ టై ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. బాల్ టాంపరింగ్ ఘటన కారణంగా స్మిత్, వార్నర్‌లపై నిషేధం విధించిన తర్వాత ఆండ్రూ టై జట్టులో కీలక ఆటగాడయ్యాడు. గత ఐపీఎల్‌లో ఆండ్రూ టై పర్పెల్ క్యాప్‌ని అందుకున్నాడు. ఇప్పటివరకు ఆసీస్ తరుపున ఏడు వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన ఆండ్రూ టై 12 వికెట్లు తీశాడు. అంతేకాదు ఆసీస్ తరుపున అత్యంత నిలకడైన ఆటతీరుని ప్రదర్శించే ఆటగాళ్లలో ఆండ్రూ టై ఒకడు. 2015లోనే టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటికీ... వన్డేల్లో మాత్రం కాస్త ఆలస్యంగా అరంగేట్రం చేశాడు.

ఓషనే థామస్ (వెస్టిండిస్)

ఓషనే థామస్ (వెస్టిండిస్)

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ఓషనే థామస్‌ దన్నుగా నిలుస్తోంది. ఈ ఏడాది గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన ఓషనే థామస్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్‌ను తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌ను మార్చుకున్న ఓషనే థామస్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. రాబోయే సీజన్ కోసం ఇటీవలే జైపూర్ వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో ఓషనే థామస్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం చేసుకుంది.

Story first published: Thursday, December 27, 2018, 17:09 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X