న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌ను ప్రభావితం చేసే టాప్-5 ఆల్‌రౌండర్లు వీరే!

ICC Cricket World Cup 2019 : Top 5 All-Rounders Who Could Make An Impact On This Cricket World Cup
Top 5 All-rounders who could make an impact on this Cricket World Cup


హైదరాబాద్: వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో అత్యంత కీలకపాత్ర. ఇదే అభిప్రాయాన్ని వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ సైతం చెప్పాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్ సాధారణ వరల్డ్‌కప్ కాదని 'ఆల్ రౌండర్స్ వరల్డ్‌కప్' అని వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

1983లో కపిల్‌ దేవ్, 1992లో ఇమ్రాన్‌ ఖాన్‌, 2011లో యువరాజ్‌ సింగ్ వీరంతా ఆయా దేశాలు వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. తాజా వరల్డ్‌కప్‌లో కూడా ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషించబోనున్నట్లు లాయిడ్ అన్నాడు. 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌లో ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాలను శాసించే ఆల్ రౌండర్లు ఎవరో చూద్దాం...

ఆండ్రీ రస్సెల్ (వెస్టిండిస్)

ఆండ్రీ రస్సెల్ (వెస్టిండిస్)

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. గత కొంతకాలంగా వెస్టిండిస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఈ 31 ఏళ్ల విధ్వంసకర ఆటగాడు... ఐపీఎల్‌లో విధ్వంసక ఆటను చూసి వరల్డ్‌కప్ ఆడే జట్టులోకి ఎంపిక చేశారు. టీ20 మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాలను మార్చేయగల సత్తా ఉన్న రసెల్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎలా ఆడతాడో చూడాలి. వెస్టిండిస్ తరుపున ఇప్పటివరకు రస్సెల్ మొత్తం 52 మ్యాచ్‌లాడి 998 పరుగులు చేశాడు.

హార్ధిక్ పాండ్యా (ఇండియా)

హార్ధిక్ పాండ్యా (ఇండియా)

క్రికెట్ లెజెండ్ కపిల్‌ దేవ్‌ తర్వాత భారత్‌కు లభించిన సిసలైన ఆల్‌రౌండర్‌‌గా హార్ధిక్ పాండ్యాను భావిస్తున్నారు. అయితే, కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనవసర వ్యాఖ్యలు చేసి కొన్నాళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. అయితే, ఆ తర్వాత కోలుకుని ఐపీఎల్ 12వ సీజన్‌లో ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 402 పరుగులు, బౌలింగ్‌లో 14 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరుపున ఇప్పటివరకు 45 వన్డేలాడిన పాండ్యా 731 పరుగులతో పాటు 44 వికెట్లు పడగొట్టాడు.

బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)

బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్ కావడంతో ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్ జట్టలో ఒకటిగా ఉంది. జానీ బెయిర్ స్టో, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్ లాంటి యువ ఆటగాళ్లతో ఆ జట్టు సూపర్ ఫామ్‌లో కొనసాగుతోంది. బెన్ స్టోక్స్ గురించి చెప్పాల్సి వస్తే గత కొన్నేళ్లుగా ఇంగ్లాండ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ ఫలితాలను మార్చగలడు. 2011లో అరంగేట్రం చేసిన బెన్ స్టోక్స్ ఇప్పటివరకు 83 వన్డేలాడి 2196 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టాడు.

షకీబ్ ఉల్ హాసన్ (బంగ్లాదేశ్)

షకీబ్ ఉల్ హాసన్ (బంగ్లాదేశ్)

షకీబ్ ఉల్ హాసన్ ఆల్ రౌండర్ల జాబితాలో పరిచయం అక్కర్లేని పేరు. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత వారం ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గాయ పడటంతో ముక్కోణపు సిరిస్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీల్లో బంగ్లాను తక్కువగా అంచనా వేయకూడదు. ఈ వరల్డ్‌కప్‌లో షకీబ్ ఉల్ హాసన్ అటు బ్యాట్‌తోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి బంగ్లాదేశ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బంగ్లా తరుపున ఇప్పటివరకు 198 వన్డే మ్యాచ్‌లాడిన షకీబ్ 5717 పరుగులతో పాటు 249 వికెట్లు తీశాడు.

జిమ్మీ నీషమ్‌ (న్యూజిలాండ్)

జిమ్మీ నీషమ్‌ (న్యూజిలాండ్)

ప్రపంచ క్రికెట్‌లో ఎక్కువ మంది ఆల్ రౌండర్లను కలిగి ఉన్న జట్లలో న్యూజిలాండ్ ఒకటి. ఇక, జిమ్మీ నీషమ్ విషయానికి వస్తే 2013లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తిరిగి 2017లో పునరాగమనం చేసిన నీషమ్‌ ఇటీవల భారత్‌, బంగ్లాదేశ్‌ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తరుపున ఈ వరల్డ్‌కప్‌లో జిమ్మీ నీషమ్ మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు 49 వన్డేలాడిన నీషమ్ 1015 పరుగులతో పాటు 44 వికెట్లు తీశాడు.

Story first published: Monday, May 20, 2019, 11:28 [IST]
Other articles published on May 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X