న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విచిత్రపు బౌలింగ్ యాక్షన్‌తో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించిన అశ్విన్ (వీడియో)

TNPL 2019 : Ravichandran Ashwin Attempts Unique Bowling Action During Match || Oneindia Telugu
TNPL 2019: R Ashwin attempts unique bowling action during match, succeeds in trapping the batsman - Watch

హైదరాబాద్: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)లో విచిత్రంగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టీఎన్‌పీఎల్‌‌లో రవిచంద్రన్ అశ్విన్ డుండిగల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అశ్విన్ తన విచిత్ర బౌలింగ్‌ యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

మధురై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 ఏళ్ల అశ్విన్ ఈ విచిత్ర బౌలింగ్ యాక్షన్‌తో వికెట్ కూడా తీశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఈ మ్యాచ్ 100వ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ బ్యాట్స్‌మన్ మైండ్‌ని చదివి వేసినట్లుగా ఉంది.

కుడి చేత్తో బంతిని పట్టుకుని

కుడి చేత్తో బంతిని పట్టుకుని

ఈ వీడియోలో కుడి చేత్తో బంతిని పట్టుకుని అశ్విన్ క్రీజులోకి వచ్చే వరకు దానిని వీపు వెనుకన దాచి పెట్టి ఉంచాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత తన ఎడమ చేతిని బలంగా వికెట్ మీదకు ఫోకస్ చేసి బంతిని స్లో డెలివరిగా సంధించడంతో బ్యాట్స్‌మన్ బౌండర్ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆఖరి ఓవర్‌లో 32 పరుగులు

ఆఖరి ఓవర్‌లో 32 పరుగులు

ఈ మ్యాచ్‌లో మధురై పాంథర్స్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 32 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆఖరి ఓవర్‌ను వేసిన అశ్విన్ కేవలం రెండు పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో మధురై పాంథర్స్‌ జట్టుపై డుండిగల్ డ్రాగన్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియోని తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌) తన అధికారిక ట్విట్టర్‌లో "బంతితో నేను చేస్తోన్న ప్రయోగాలు - ఈ డెలివరీకి మీరు ఏం పేరు పెడతారు?" అని కామెంట్ పెట్టి అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు

అయితే, ఈ టోర్నీలో అశ్విన్ విచిత్రంగా బౌలింగ్ చేయడం ఇది తొలిసారి కాదు. టోర్నీలో భాగంగా శుక్రవారం చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌‌తో జరిగిన ఓపెనింగ్‌ మ్యాచ్‌లో సైతం పుల్ యాక్షన్‌తో కాకుండా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. మరోవైపు అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విండిస్ పర్యటనకు ఎంపికైన అశ్విన్

ఈ ఏడాది ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ 'మన్కడింగ్‌'తో వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వెస్టిండిస్ పర్యటన కోసం ఎంపిక చేసిన టెస్టు జట్టులో అశ్విన్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కంట్రీ క్రికెట్‌లో భాగంగా నాటింగ్‌హామ్ జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం ముగియడంతో ఇంగ్లాండ్ నుంచి అశ్విన్ స్వదేశానికి తిరిగొచ్చాడు.

Story first published: Tuesday, July 23, 2019, 15:53 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X