న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనం జంతువుల్లా జీవిస్తున్నాం.. మనుషుల్లా మానవత్వాన్ని చూపే సమయం ఇది: అక్తర్

Time To Be Human, Not Hindu-Muslim: Shoaib Akhtar On Fight Against Coronavirus

కరాచీ: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గం అని పాకిస్తాన్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. మనం జంతువుల్లా జీవిస్తున్నాం, మనుషుల్లా మానవత్వాన్ని చూపే సమయం ఇది అని పేర్కొన్నాడు. నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకునే సమయంలో రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. పాకిస్థాన్ ప్రజలు వైరస్‌ని అడ్డుకోవడంలో ఏమాత్రం చొరవ చూపడం లేదని, దానికి కారణం పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

<strong>'విరాట్ కోహ్లీ అని కాదు.. బాబర్ అజామ్‌ అని పిలవండి'</strong>'విరాట్ కోహ్లీ అని కాదు.. బాబర్ అజామ్‌ అని పిలవండి'

లాక్‌డౌన్‌కు సహకరించండి

లాక్‌డౌన్‌కు సహకరించండి

తాజాగా అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ... 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులు, ప్రజలను వేడుకుంటున్నా. కరోనా వైరస్ ఒక ప్రపంచ సంక్షోభం. మనం దానిని ఎదుర్కోవడానికి ఒక ప్రపంచ శక్తిగా ఆలోచించాలి. ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. అంతేకాని.. గుంపులుగా ఉండడం, మీటింగ్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు' అని అక్తర్ అన్నాడు.

హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదు:

హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదు:

'మనం నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకోవద్దు. రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాలి. రోజు వారీ శ్రామికుడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు?, ఓసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రతీ స్టోర్‌ ఖాళీగానే కనుబడటం లేదా మూసి వేయడం జరుగుతూ ఉంది. ఇది మూడు నెలల తర్వాతైనా అదుపులోకి వస్తుందనే గ్యారంటీ లేదు. ఏ రోజుకు ఆరోజు బ్రతికే వారి గురించి అంతా ఆలోచించాలి. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదు. మనిషి మనిషిలాగా ఉండి కనీసం తమ వంతు సాయం చేయాలి' అని అక్తర్ పేర్కొన్నాడు.

 మనుషుల్లా బ్రతుకుదాం:

మనుషుల్లా బ్రతుకుదాం:

'ఆర్థిక పరిస్థితి బాగున్నవారు నేటికి పెద్దగా సమస్యను ఏమీ చూడటం లేదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నది పేద ప్రజలు మాత్రమే. మనం మనుషుల్లా బ్రతుకుదామా.. లేక జంతువుల్లా ఉందామా. కనీసం తినడానికి తిండి లేనివాడికి సాయం చేయడానికి ప్రయత్నించండి. నిల్వలు పెట్టుకునే మాటే వద్దు. ఒకరికోసం ఒకరు అన్నట్లే ఉండాలి. అవతలి వాడి గురించి మనకెందుకు అనే ధోరణి వద్దు. మనుషులగా ఉండి తోటి వారిని రక్షించుకుందా' అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం:

పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం:

'ఆదివారం ముఖ్యమైన పని మీద బయటకు వచ్చా. నేను ఎవరికీ షేక్‌ హ్యాండ్స్, హగ్స్ ఇవ్వలేదు. నా ప్రయాణం మొత్తం కారులోనే జరిగింది. ఆ సమయంలో రోడ్డుపై ప్రజలు నిర్లక్ష్యంగా ప్రయాణించడాన్ని గమనించా. ఓ బైక్‌పై నలుగురు యువకులు వెళ్తున్నారు. సెలవు కావడంతో వారు విహారయాత్రకి వెళ్తున్నారట. రోడ్డుపైనే కొంత మంది భోజనాలు చేయడాన్ని చూసా. కరోనా కట్టడికి భారత్‌లో కర్ఫ్యూని విధించారు. మరి పాకిస్థాన్‌లో ఎందుకు ఎలాంటి రక్షణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. కరోనా ఎక్కువగా మనుషుల కాంటాక్ట్ ద్వారానే వస్తుంది. కానీ.. పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఎవరూ ఇళ్లలో ఉండటం లేదు. ఇది దేశానికి ప్రమాదకరంగా మారబోతోంది' అని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు.

Story first published: Monday, March 23, 2020, 15:34 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X