న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ పర్యటనలో విఫలం: టెస్టుల్లో ధావన్‌కు చోటు కష్టమేనా?

India vs England 2018 5th Test: Shikhar Dhawan Looses Scope For Furthur Tests
Time to Close the Test Door on Shikhar Dhawan?

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్ ఇకపై టెస్టుల్లో చోటు దక్కించుకోవడం కష్టమేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టులు ఆడిన శిఖర్ ధావన్ చేసిన పరుగులు 26, 13, 35, 44, 23, 17, 3, 1. ఇలా ఉన్నాయి.

<strong>5వ టెస్టు, ఆఖరి రోజు: రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు విహారి డకౌట్</strong>5వ టెస్టు, ఆఖరి రోజు: రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు విహారి డకౌట్

ఈ పర్యటనలో ఎవరైనా బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు అంటే అది శిఖర్ ధావనే. నిజానికి ఉపఖండం పిచ్‌లపై స్వేచ్ఛగా ఆడే శిఖర్ ధావన్ విదేశీ పిచ్‌లపై.. అదీ ఒకే తరహాలో వైడ్‌గా వెళ్తున్న బంతులను వెంటాడి మరీ.... వికెట్ చేజార్చుకోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

1
42378
ఇంగ్లీషు గడ్డపై శిఖర్ ధావన్‌ పూర్తిగా విఫలం

ఇంగ్లీషు గడ్డపై శిఖర్ ధావన్‌ పూర్తిగా విఫలం

ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే, ఇంగ్లీషు గడ్డపై శిఖర్ ధావన్‌ చేసిన ప్రదర్శనను బట్టి సెలక్టర్లు మళ్లీ అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. మరోవైపు ఇదే పర్యటనలో ధావన్‌తో పాటు విఫలమైన మరో ఓపెనర్ మురళీ విజయ్‌పై చివరి రెండు టెస్టుల్లో సెలక్టర్లు వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఓపెనర్‌గా పృధ్వీ షా‌ను ఎంపిక

ఓపెనర్‌గా పృధ్వీ షా‌ను ఎంపిక

ఈ క్రమంలో చివరి రెండు టెస్టుల్లో అతడి స్థానంలో యువ ఓపెనర్ పృధ్వీ షా‌ను ఎంపిక చేశారు. అయితే, అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో చివరి రెండు టెస్టుల్లో శిఖర్ ధావన్‌వైపే టీమిండియా జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఐదో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ

ఐదో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ

ఓవల్ వేదికగా ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్‌‌తో జరుగుతున్న చివరి టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించి ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. శిఖర్ ధావన్ మాత్రం ఘోరంగా విఫలమైన తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్ వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పృధ్వీ షా బరిలోకి దిగే అవకాశం ఉంది.

లంచ్ విరామ సమయానికి భారత్ 167/5

లంచ్ విరామ సమయానికి భారత్ 167/5

కాగా, ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు, ఆఖరి రోజున లంచ్ విరామ సమయానికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(108), రిషబ్ పంత్(12) పరుగులతో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 423 పరుగులు చేసిన ఇంగ్లాండ్ భారత్‌కు 464 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది.

Story first published: Tuesday, September 11, 2018, 19:42 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X