న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా లక్ష్యం భారత్‌.. ఫ్యాన్స్‌, ఆటగాళ్లకు నోరూరించే సిరీస్!!

IND VS Aus 2020 : Tim Paine Eyeing To Play The Mouth Watering Test Series Against India || Oneindia
Tim Paine said Test series against India going to be mouth-watering

సిడ్నీ: ఏడాది చివర్లో టీమిండియాతో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ అంటే ఆటగాళ్లకు, అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. నోరూరించే సిరీస్ అని ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ అన్నాడు. మొదటగా మా లక్ష్యం బంగ్లాదేశ్‌ సిరీస్, ఆ తర్వాత టార్గెట్‌ భారత్‌ అని పేర్కొన్నాడు. సోమవారం న్యూజిలాండ్‌తో ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

9.54కి మ్యాచ్ రద్దు.. 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయిన ఆటగాళ్లు!!9.54కి మ్యాచ్ రద్దు.. 9 గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయిన ఆటగాళ్లు!!

మా లక్ష్యం బంగ్లాదేశ్‌:

మా లక్ష్యం బంగ్లాదేశ్‌:

మ్యాచ్ అనంతరం టిమ్‌ పైన్‌ మాట్లాడుతూ... 'స్వదేశంలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం మా తదుపరి లక్ష్యం బంగ్లాదేశ్‌. ఆ తర్వాత భారత్‌. రెండు టెస్టుల సిరీస్‌ కోసం జూన్‌లో బంగ్లాదేశ్‌కు వెళుతున్నాం. అక్కడ విజయాలు సాధించి టీమిండియా సిరీస్‌పై దృష్టి పెడతాం' అని అన్నాడు.

బ్యాటింగ్‌ దుర్బేద్యం:

బ్యాటింగ్‌ దుర్బేద్యం:

'గత టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది. అయితే అప్పటి జట్టు పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నాం. డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌, మార్నస్ లబుషేన్‌లతో బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉంది. పేస్‌, స్పిన్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను చిక్కుల్లో పడేసే బౌలర్లు ఉన్నారు' అని పైన్‌ పేర్కొన్నాడు.

ఆత్రుతగా ఎదురుచూస్తున్నా:

ఆత్రుతగా ఎదురుచూస్తున్నా:

'టీమిండియాతో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ కారణంగా ఈ సిరీస్‌ ఇరు జట్లుకు కీలకం. ఎవరు గెలిస్తే వారికి లాభం. టీమిండియాపై టెస్టు సిరీస్‌ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్‌ ఆరాటపడుతుతున్నారు. అందుకే టీమిండియాతో సిరీస్‌ కోసం మేమందరం వేచిచూస్తున్నాం' అని పైన్‌ చెప్పుకొచ్చాడు.

టెస్టు చాంపియన్‌ షిప్‌లో 296 పాయింట్లు:

టెస్టు చాంపియన్‌ షిప్‌లో 296 పాయింట్లు:

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. దీంతో ఆసీస్‌ ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌లో 296 పాయింటలతో టీమిండియా (360) తరువాతి స్థానంలో ఉంది. టీ20 ప్రపంచకప్‌ ముగిశాక టీమిండియా టెస్టులపై ఫోకస్‌ పెట్టనుంది. వరుసగా టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది.

Story first published: Tuesday, January 7, 2020, 12:39 [IST]
Other articles published on Jan 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X