రాయితో దాడి: ఖండించిన మిథాలీ, క్షమించమని ప్లకార్లులు

Posted By:

హైదరాబాద్: ఆసీస్ క్రికెటర్ల బస్సుపై జరిగిన రాయి దాడిని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఖండించారు. బుధవారం ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆటను ఆటలాగా చూడాలంటూ హితవు పలికారు. వారిపై దాడి చేయడం మన ఇంటికి వచ్చిన అతిథిని అవమానించినట్లు అవుతుందని ఆమె అన్నారు.

గువహటి వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు.

రాయి దాడి ఘటనలో బస్సు కిటికీ పూర్తిగా ధ్వంసం

రాయి దాడి ఘటనలో బస్సు కిటికీ పూర్తిగా ధ్వంసం

ఈ సంఘటనలో బస్సు కిటికీ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సీట్లో క్రికెటర్లెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్రికెటర్లందరూ సురక్షితంగా ఉన్నారని అసోం క్రికెట్ అసోసియేసన్ (ఏసీఏ) తెలిపింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది.

తప్పిన పెను ప్రమాదం

క్రికెటర్లకు కల్పించిన భద్రతపై తాము సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే రాయి విసిరినప్పుడు విండో సీట్‌లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. అయితే, ఈ ఘటన క్రికెటర్లను ఆందోళనకు గురి చేసినట్లు తెలిపింది.

భారత్ క్రికెట్‌కు చెడ్డ పేరు

అయితే ఈ సంఘటనతో భారత్ క్రికెట్‌కు చెడ్డ పేరు వస్తుందని భావించిన కొందరు అభిమానులు హుందాగా ప్రవర్తించారు. మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 కోసం గువహటి నుంచి హైదరాబాద్‌కు ఆస్ట్రేలియా జట్టు బయల్దేరిన సమయంలో ఆసీస్ జట్టు బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ బయట నిల్చొని క్షమించమని ప్లకార్లులు పట్టుకున్నారు.

ఆసీస్ క్రికెటర్లను సైతం ఆకట్టుకుంది

ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు ఇలా స్టేడియాల్లో నిరసనలు, బస్సులపై దాడులు జరగడం సహజమే. అయితే ఎవరో గుర్తు తెలియని దుండగులు చేసిన పనికి అందరినీ తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ ఇలా సారీ చెప్పడం ఆసీస్ క్రికెటర్లను సైతం ఆకట్టుకుంది.

Story first published: Thursday, October 12, 2017, 13:28 [IST]
Other articles published on Oct 12, 2017
Please Wait while comments are loading...
POLLS