న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: సత్తా ఉన్నా ఛాన్స్ రాలేదు.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఈ ముగ్గురికీ అవకాశం దక్కేనా..?

Three young players who can make their ODI debut in INDvsNZ ODI series

టీ20 వరల్డ్ కప్ నుంచి అర్ధంతరంగా వెనుతిరిగిన భారత జట్టు వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. వెటరన్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు టీ20 సిరీస్‌లో ఆడిన భువనేశ్వర్ కుమార్ కూడా వన్డే సిరీస్‌కు దూరమవుతాడు. దీంతో యువ ప్లేయర్లకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉన్న యువప్లేయర్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..

ఉమ్రాన్ మాలిక్

ఉమ్రాన్ మాలిక్

జమ్మూ ఎక్స్‌ప్రెస్ అని పిలుచుకునే ఉమ్రాన్ మాలిక్‌ను టీమిండియాలో భాగం చేసేందుకు సెలెక్టర్లు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. భారత బౌలింగ్ యూనిట్‌లో నిఖార్సయిన పేస్ బౌలర్ అరుదుగా కనిపిస్తాడు. ఉమ్రాన్ వద్ద ఉన్నదే అది. అందుకే ఎలాగైనా అతన్ని జట్టులో భాగం చేయాలని అనుకున్నారు. అందుకే కివీస్ పర్యటనకు ఎంపిక చేశారు. కానీ టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఈ జమ్మూ పేసర్‌కు రాలేదు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు మూడు టీ20లు ఆడిన ఉమ్రాన్.. వన్డేల్లో ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

 అర్షదీప్ సింగ్

అర్షదీప్ సింగ్

ఇటీవలి కాలంలో టీమిండియా టీ20 జట్టులో కీలకంగా మారిన బౌలర్ అర్షదీప్ సింగ్. అద్భుతమైన బౌలింగ్‌తో అందరి మన్ననలు పొందిన ఇతను.. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంత సత్తా చాటినా కూడా ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం అర్షదీప్‌కు రాలేదు. మరి కివీస్ పర్యటనలో అయినా ఆ అవకాశం వస్తే వన్డేల్లో కూడా సత్తా చాటేందుకు ఈ ఎడం చేతి వాటం పేసర్ సిద్ధంగా ఉన్నాడు.

 కుల్దీప్ సేన్

కుల్దీప్ సేన్

ఇండియా-ఎ తరఫున సత్తా చాటిన కుల్దీప్ సేన్.. ఐపీఎల్‌లో కూడా రాణించాడు. అందుకే అతన్ని టీమిండియాకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. హార్డ్ లెంగ్త్‌ను పట్టుకోవడం, పేస్‌తో బ్యాటర్లను ఆశ్చర్యపరచడం కుల్దీప్ సేన్ బలాలు. న్యూజిల్యాండ్-ఎతో జరిగిన సిరీస్‌లో కూడా సత్తా చాటాడీ మధ్యప్రదేశ్ పేసర్. టీమిండియాలో 'హిట్‌ ది డెక్ హార్డ్' తరహా పేసర్లకు కరువు ఉంది. కుల్దీప్ అచ్చం అలాంటి బౌలరే. అందుకే అతను ఈ సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తాడని భావిస్తున్నారు. అలాగే గాయపడిన యశ్ దయాళ్ స్థానంలో బంగ్లా టూర్‌కు కూడా కుల్దీప్ సేన్‌ను ఎంపిక చేశారు. మరి ఈ యువ పేసర్.. కివీస్‌పైనే వన్డే అరంగేట్రం చేస్తాడా? లేక బంగ్లా పర్యటన కోసం వెయిట్ చెయ్యాల్సిందేనా చూడాలి.

Story first published: Thursday, November 24, 2022, 20:18 [IST]
Other articles published on Nov 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X