న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌-2019 సీజన్‌కు మిలియన్ డాలర్ బేబీగా హెట్‌మెయిర్?

Three IPL teams which could go for Shimron Hetmyer in the auctions

హైదరాబాద్: వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం భారత పర్యటనలో పరుగుల వరద పారిస్తోన్న వెస్టిండిస్‌ బ్యాట్స్‌మన్‌ షిమ్రాన్ హెట్‌మెయిర్ ఐపీఎల్‌-2019 సీజన్‌కు మిలియన్ డాలర్ బేబీ కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

<strong>పూణెలో మూడో వన్డే: ప్రివ్యూ, ఎక్కడ చూడాలి, టైమింగ్, కీలక ఆటగాళ్లు</strong>పూణెలో మూడో వన్డే: ప్రివ్యూ, ఎక్కడ చూడాలి, టైమింగ్, కీలక ఆటగాళ్లు

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హెట్‌మెయిర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి తమ జట్టు భారీ స్కోర్‌ చేసేలా చేశాడు. ఇక, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో దాదాపు భారత్‌ను ఓడించినంత పనిచేశాడు.

రెండో వన్డేలో తృటిలో సెంచరీ మిస్

రెండో వన్డేలో తృటిలో సెంచరీ మిస్

ఈ మ్యాచ్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో 7 సిక్సర్లు బాదాడు. అయితే, అనవసర షాట్‌కు యత్నించి హెట్‌మెయిర్ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. హెట్‌మెయిర్ ప్రదర్శనకు భారత మాజీ, సీనియర్‌ క్రికెటర్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో హెట్‌మెయిర్ ఐపీఎల్‌-2019 సీజన్‌లో భారీ ధరనే పలకబోతున్నాడని అంచనా వేస్తున్నారు. భారత సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‌కు హెట్‌మెయిర్ మిలియన్‌ డాలర్‌ బేబీ అని పేర్కొన్నాడు. అతడి కోసం కోసం ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు పోటీపడతాయని అన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

గత సీజన్‌‌లో ఫైనల్‌ల్లో ఓటమిపాలై ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ హెట్‌మెయిర్ కోసం పోటిపడనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ దూరంతో బాధ్యతలు చేపట్టిన కేన్ విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపైనే మోసిన విలియమ్సన్‌కు మిడిలార్డర్‌ నుంచి సహాకారం దూరమైంది. దీంతో ఆ జట్టు ఫైనల్లో ఓటమిపాలైంది. వచ్చే సీజన్‌లో వార్నర్‌ పునరాగమనంతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ పరిస్థితుల్లో హెట్‌మెయిర్ మిడిలార్డర్‌ను పటిష్టం చేయాలని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇక, ఆ జట్టు ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీకి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో సంబంధం ఉండటం కలిసొచ్చే అంశం.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సైతం హెట్‌మెయిర్ కోసం పోటీ పడుతోంది. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, డివిలియర్స్‌ ఉన్నప్పటికి ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్‌ సాధించలేకపోయింది. 2019 సీజన్‌లో టైటిల్‌ లక్ష్యంగా భావిస్తున్న బెంగళూరు జట్టు ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు మొదలు పెట్టింది. కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్‌లో పలు మార్పులు చేసింది. వచ్చే సీజన్‌లో గ్యారీ కిరిస్టెన్‌కు పూర్తి స్థాయి కోచ్‌ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలోనే విండిస్ పర్యటనలో ఆకట్టుకున్న హెట్‌మెయిర్‌ను తీసుకోవాలని యోచిస్తోంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్

ఢిల్లీ డేర్‌డెవిల్స్

గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు యువ ఆటగాళ్లతో కళకళలాడింది. ఇప్పటికే ఆ జట్టులో పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు టాపార్డర్‌లో నిలకడగా రాణిస్తున్నారు. అయితే ఆ జట్టుకు మంచి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చే బ్యాట్స్‌మన్‌ లేకపోడవంతో ఆ స్థానాన్ని హెట్‌మెయిర్‌తో భర్తీ చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తన ప్రదర్శనతో అందిరి దృష్టిలో పడ్డ హెట్‌మెయిర్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎవరి సొంతం అవుతాడో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

Story first published: Friday, October 26, 2018, 18:57 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X