న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్ నెగ్గేందుకు భారత్ కష్టతరమైన ప్రదేశం: గణాంకాలే చెబుతున్నాయి

This Indian team under Virat Kohli is tough: Faf du Plessis

హైదరాబాద్: టెస్టు సిరిస్ నెగ్గేందుకు భారత కష్టతరమైన ప్రదేశమని గణాంకాలే చెబుతున్నాయని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. రాంచీ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘోర ఓటమిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అతిపెద్ద ఓటమి.

రాంచీ వేదికగా మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో సఫారీలపై 3-0తో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై 3-0తో సిరిస్‌ను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం టీమిండియాను చూస్తుంటే ఓడించడం ఏ జట్టుకైనా అంత సులభం కాదని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ అన్నాడు.

ప్రపంచంలో ఎక్కడైనా టెస్టు సిరీస్‌లు గెలవగలం: సఫారీలపై 3-0తో క్లీన్‌స్వీప్ తర్వాత కోహ్లీప్రపంచంలో ఎక్కడైనా టెస్టు సిరీస్‌లు గెలవగలం: సఫారీలపై 3-0తో క్లీన్‌స్వీప్ తర్వాత కోహ్లీ

డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ

డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ "ఈ పర్యటన మాకు కఠినతరంగా మారింది. మళ్లీ భారత్‌కు రాబోయే పర్యటన నాటికి మా జట్టు రాటుదేలాల్సిన అవసరం ఉంది. టెస్టు సిరిస్ నెగ్గేందుకు భారత కష్టతరమైన ప్రదేశమని గణాంకాలే చెబుతున్నాయి" అని అన్నాడు.

టీమిండియా చాలా బలంగా ఉంది

టీమిండియా చాలా బలంగా ఉంది

"కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా చాలా బలంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లతో పాటు ఫీల్డింగ్‌లో కూడా టీమిండియా మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ సిరీస్‌లో భారత సీమర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టీమిండియా పేసర్లతో మా సీమర్లు పోటీపడలేకపోయారు. మా సీమర్లు తొలి 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ప్రభావం చూపితే, భారత సీమర్లు మాత్రం రోజంతా రాణించారు" అని డుప్లెసిస్ అన్నాడు.

బౌలర్ యొక్క నైపుణ్యం, స్వభావం

బౌలర్ యొక్క నైపుణ్యం, స్వభావం

"ఇది బౌలర్ యొక్క నైపుణ్యం, స్వభావం అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ సిరిస్‌లో విజయవంతమైన బౌలర్లను పరిశీలిస్తే వారు కూడా ఎక్కువ సమయం సరైన ప్రాంతాల్లో బంతులను సంధించారు. దీని ఫలితంగానే మేము సిరీస్‌ను కోల్పోయాం. భారత బ్యాటింగ్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాం" అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

సిరిస్‌కు ముందు స్పిన్ బౌలింగ్ గురించి చర్చించాం!

సిరిస్‌కు ముందు స్పిన్ బౌలింగ్ గురించి చర్చించాం!

"ఈ సిరిస్‌కు ముందు టీమిండియా స్పిన్ బౌలింగ్ గురించి చర్చించాం. 2015 పర్యటనను దృష్టిలో పెట్టుకుని స్పిన్ దాడికి సిద్ధం కావాలని భావించాం" అని డుప్లెసిస్ తెలిపాడు. అయితే, అందుకు భిన్నంగా టీమిండియా సీమర్లు ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేయడం విశేషం. మరోవైపు తమ జట్టులోని యువ ఆటగాళ్లు రాబోవు 3 నుంచి 4 ఏళ్లలో రాటుదేలతారని డుప్లెసిస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, October 22, 2019, 15:11 [IST]
Other articles published on Oct 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X