న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బుమ్రా నో బాల్‌ వేయడంతోనే.. ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడాం'

Things changed after Jasprit Bumrah no ball: Bhuvneshwar Kumar recalls 2017 Champions Trophy final

న్యూఢిల్లీ: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపై భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో యార్కర్ కింగ్ జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నో బాల్‌ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌కు బుమ్రా వేసిన నో బాల్‌ మొత్తం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిందన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో‌ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫకర్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ ఎంఎస్ ధోనీ అందుకున్నా.. అది నో బాల్‌ కావడంతో భారత్ టైటిల్ ఆశలు గల్లంతు అయ్యాయన్నాడు.

బుమ్రా నో బాల్‌ కొంపముంచింది

బుమ్రా నో బాల్‌ కొంపముంచింది

భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తాతో జరిగిన వీడియో చాట్ షో క్రికెట్‌బాజీలో భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. '2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్ష పోరులా మారిపోయింది. జట్టంతా సమష్టిగా విఫలం చెందడం ఒక ఎత్తు అయితే.. జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నో బాల్‌ మరో ఎత్తు. నో బాల్‌ కారణంగా ఫకర్‌ 114 పరుగులు చేసి పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చేధనలో మేము పూర్తిగా విఫలమయ్యాం. పాక్‌ 338 పరుగులు చేస్తే.. మేము 158 పరుగులకే ఆలౌటై 180 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూశాం' అని భువీ తెలిపాడు.

భారత ప్రదర్శన ఎంతో మెరుగైంది

భారత ప్రదర్శన ఎంతో మెరుగైంది

గత కొన్నేళ్లుగా భారత ప్రదర్శన ఎంతో మెరుగైందని భువనేశ్వర్ కుమార్ అన్నాడు. '2013లో చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మూడు నుంచి నాలుగు ఐసీసీ టోర్నీలు జరిగితే అందులో రెండు నుంచి మూడు సార్లు సెమీస్‌, ఫైనల్స్‌కు చేరాం. 2015లో ఆసీస్‌తో సెమీస్‌లో ఓడిపోయాం. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఓటమి. 2019 ప్రపంచకప్‌‌లో కూడా బ్యాడ్‌లక్‌ వెంటాడింది. మా టాపార్డర్‌ విఫలం కావడంతో సాధారణ స్కోరును కూడా సాధించలేక సెమీస్‌ నుంచే నిష్క్రమించాం. అయితే ఓవరాల్‌గా గత కొన్నేళ్లుగా భారత ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంది' అని భువీ చెప్పాడు.

180 పరుగుల భారీ తేడాతో పాక్ విజయం

180 పరుగుల భారీ తేడాతో పాక్ విజయం

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2017 టోర్నీలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుతంగా ఆడింది. లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే ఫైన‌ల్లో అదే జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 339 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో రోహిత్‌ శర్మ, శిఖ‌ర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్‌, ఎంఎస్ ధోనీ విఫ‌ల‌మ‌య్యారు. చివ‌ర్లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆశ‌లు రేపినా.. రవీంద్ర జడేజాతో స‌మ‌న్వ‌య లోపంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. పాక్ 180 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ పేసర్ మొహమ్మద్ అమిర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అజర్ అలీ, ఫకర్ జమాన్ ఓపెనింగ్ వికెట్ కోసం 128 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు.

ఇంగ్లండ్ కెప్టెన్‌గా‌ బెన్‌ స్టోక్స్‌ 'సరైనోడు': బ్రాడ్‌

Story first published: Monday, June 29, 2020, 18:33 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X