న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : మినీవేలంలో అతని కోసం పోటీ తప్పదు.. సన్‌రైజర్స్ మళ్లీ కొనేస్తుందా?

These three teams may fight for West Indies batter Nicholas Pooran in Mini Auction

ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పన్నెండు మంది ఆటగాళ్లను రిలీజ్ చేసేసింది. వారిలో విండీస్ నయా కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా ఉన్నాడు. మెగా వేలంలో ఏకంగా రూ.10.75 కోట్లకు అతన్ని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. పర్సులో మరింత డబ్బును మిగిల్చుకోవడం కోసం పూరన్‌ను వదులుకుంది. విండీస్ తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన అతని కోసం వేలంలో గట్టిపోటీనే నెలకొనే అవకాశం ఉంది. మరి అతని కోసం గట్టిగా పోటీ పడే మూడు ఫ్రాంచైజీలు ఏవో ఒకసారి పరిశీలిస్తే..

కోల్‌కతా నైట్ రైడర్స్

కోల్‌కతా నైట్ రైడర్స్

మినీ వేలానికి ముందు కేకేఆర్ జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జట్టులో వికెట్ కీపింగ్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్, బాబా ఇంద్రజిత్, శామ్ బిల్లింగ్స్ ముగ్గుర్నీ వదిలేసుకుంది. దీంతో పూరన్ కోసం ఈ జట్టు పోటీ పడే అవకాశం ఉంది. పూరన్ అయితే కీపింగ్ చేయడంతోపాటు మిడిలార్డర్‌లో కూడా బలమైన ఆటగాడిగా ఉంటాడు. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి కేకేఆర్ ట్రేడ్ చేసుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ కూడా కీపింగ్ చేయగలడు. అదే సమయంలో కేకేఆర్ పర్సులో ప్రస్తుతం రూ.7.05 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బుతో పూరన్‌ కోసం పోటీ పడటం కష్టమే.

గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వచ్చే ఏడాది సీజన్ ప్రారంభించనున్న గుజరాత్ టైటాన్స్ వద్ద వృద్ధిమాన్ సాహా, మాథ్యూవేడ్ రూపంలో ఇద్దరు వీకెట్ కీపింగ్ బ్యాటర్లు ఉన్నారు. అయితే సాహా మరీ సీనియర్ అయిపోయాడు. అదే సమయంలో గతేడాది మాథ్యూ వేడ్ దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం పది మ్యాచులు ఆడిన అతను 15.70 సగటు, 113.77 స్ట్రైక్ రేటుతో కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో సరైన వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం గుజరాత్‌కు చాలా ఉంది. అందుకే పూరన్‌ను కొనుగోలు చేసేందుకు గుజరాత్ పోటీ పడే అవకాశం కనపడుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

గతేడాది సన్‌రైజర్స్‌కే ఆడిన పూరన్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తం 14 మ్యాచుల్లో ఆడిన అతను కేవలం 306 పరుగులు చేశాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంటే మిగతా 12 మ్యాచుల్లో అతను చేసిన పరుగులు 200 మాత్రమే అన్నమాట. అందుకే అతన్ని వదులుకొని రూ.10.75 కోట్లు పర్సులోకి తెచ్చుకుంది సన్‌రైజర్స్ యాజమాన్యం. ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేని అతన్ని తక్కువ మొత్తానికి మళ్లీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాహుల్ త్రిపాఠీ రూపంలో మరో వికెట్ కీపర్ ఉండటంతో పూరన్ కోసం మళ్లీ సన్‌రైజర్స్ ప్రయత్నిస్తుందా? లేదా అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం.

Story first published: Saturday, November 19, 2022, 13:41 [IST]
Other articles published on Nov 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X