న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: వీళ్లు ముగ్గురూ.. మూడో వన్డేలో అయినా ఆడతారా..?

 These three Team india stars must perform in the final ODI

బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు వన్డేల్లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం, పలువురికి గాయాలు భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆటగాళ్లపై అందరి ఫోకస్ పడింది. మొదటి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన ఈ ఆటగాళ్లు మూడో వన్డేలో అయినా ఆడి జట్టును గెలిపిస్తారేమో చూడాలి.

 విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఉన్న ఫామ్ చూసి అందరూ 'కింగ్ తిరిగొచ్చేశాడు' అని అనుకున్నారు. కానీ బంగ్లా పర్యటనలో మాత్రం కోహ్లీ ఏమాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చెయయలేదు. తొలి వన్డేలో 9 పరుగులకే పెవిలియన్ చేరిన కోహ్లీ.. రెండో వన్డేలో రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చాడు. అక్కడ కూడా దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వన్డేలో అయినా ఆడి జట్టును కోహ్లీ గెలిపిస్తాడేమో చూడాలి.

శిఖర్ ధవన్

శిఖర్ ధవన్

వన్డేల్లో టీమిండియా మొదటి చాయిస్ ఓపెన్ శిఖర్ ధవన్. రోహిత్ లేని సమయంలో జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరిస్తూ వచ్చిన ధవన్.. ఈ ఏడాది అంత మంచి ఫామ్‌లో కనిపించడం లేదు. కివీస్ పర్యటనలో కూడా పెద్దగా రాణించని ధవన్.. బంగ్లాదేశ్‌తో మ్యాచుల్లో మరీ దారుణంగా ఆడుతున్నాడు. ఈ 37 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

టీ20 వరల్డ్ కప్‌లో తన నెమ్మదైన ఆటతీరుతో విమర్శలపాలైన కేఎల్ రాహుల్.. బంగ్లాతో తొలి వన్డేలో బాగానే ఆడాడు. హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కానీ రెండో వన్డేలో మళ్లీ తన పాత పద్ధతిలోనే నెమ్మదిగా ఆడి విమర్శలపాలయ్యాడు. ఇక మూడో వన్డేలో కెప్టెన్‌గా బరిలో దిగుతున్న అతను.. ఏమాత్రం రాణించకపోయినా మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

Story first published: Saturday, December 10, 2022, 10:46 [IST]
Other articles published on Dec 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X