న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : వేలంలో అందరి చూపూ ఆ ముగ్గురిపైనే?.. భారీ ధర పలికే ఆల్‌రౌండర్లు వీళ్లే..!

These three all-rounders will earn big in Mini Auction

వచ్చే ఏడాది జరిగే క్రికెట్ జాతర ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాయి. అవసరం లేని ఆటగాళ్లను వదిలించేసుకొని, పర్సులో డబ్బులు సిద్ధం చేసుకొని మినీ వేలానికి రెడీ అయిపోయాయి. వచ్చే నెలలో జరిగే ఈ మినీ వేలంలో అందరి దృష్టినీ ఆకర్షించే ఆటగాళ్లు కొందరు ఉన్నారు. వారి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ తప్పదు.

ముఖ్యంగా ఆల్‌రౌండర్లకు ఐపీఎల్‌లో ఎప్పుడూ భారీగానే ధర పలికింది. యువరాజ్ సింగ్ నుంచి రవీంద్ర జడేజా, రాహుల్ తెవాటియా వంటి వారి వరకు ఆల్‌రౌండర్ అంటే చాలు భారీ ధరకు కొనేందుకు ఫ్రాంచైజీలు ఎప్పుడూ వెనుకాడలేదు. ఈ విషయం తమకు తెలుసన్నట్లు కొందరు ఆల్‌రౌండర్లు సరిగ్గా ఈ మినీ వేలానికి ముందే తాము కెరీర్ పీక్స్‌లో ఉన్నట్లు సంకేతాలు పంపారు. దీంతో వీళ్ల కోసం ఫ్రాంచైజీలు కొట్టుకు చావడం ఖాయంగా కనిపిస్తోంది.

బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్

ఐపీఎల్‌లో తన విలువ ఏంటో బెన్ స్టోక్స్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతను వేలంలో పాల్గొన్న రెండుసార్లూ రూ.10 కోట్లపైనే ధర పలికాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన అతను.. ఐపీఎల్ వేలంలో హాట్ కేకులా అమ్ముడుపోవడం గ్యారంటీ. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు అతన్ని ఫ్యూచర్ కెప్టెన్సీ కోసం కొనుగోలు చేసినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న సన్‌రైజర్స్.. అతని స్థానంలో స్టోక్స్‌ను తీసుకోవడానికి బాగానే ఖర్చు పెట్టొచ్చు.

కామెరూన్ గ్రీన్

కామెరూన్ గ్రీన్

ఈ ఆస్ట్రేలియా కుర్రాడు ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఎంత విధ్వంసం సృష్టించాడో తెలిసిందే. భారత్‌తో జరిగిన మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అవసరమైనప్పుడు బంతితో కూడా రాణించే అతని కోసం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం కనిపిస్తోంది. భారత్‌తో టీ20 సిరీస్‌లో డేవిడ్ వార్నర్ లేని లోటును పూడ్చడంతోపాటు.. అతని స్థానానికే ఎసరు పెట్టాడీ యువ ఆల్‌రౌండర్. అతని వయసు కూడా కేవలం 23 సంవత్సరాలే. అంటే సరిగ్గా ఉఫయోగించుకుంటే ఏ ఫ్రాంచైజీలో అయినా సరే పదేళ్లుపాటు సేవలందించగలడీ యువ ఆసీస్ ప్లేయర్.

శామ్ కర్రాన్

శామ్ కర్రాన్

టీ20 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. బంతితోనే ఇంగ్లండ్‌కు కప్పు అందించిన ప్లేయర్ శామ్ కర్రాన్. ఆడిన ప్రతి మ్యాచులోనూ కత్తుల వంటి బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. అతని సత్తా చూసిన ఐసీసీ కూడా అతన్ని 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డుతోపాటు ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా అందించింది. అతని కోసం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Story first published: Tuesday, November 22, 2022, 10:25 [IST]
Other articles published on Nov 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X