న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దేశం విడిచి వెళ్లిపో': కోహ్లీ వ్యాఖ్యలపై సెహ్వాగ్ ఏమన్నాడో తెలుసా?

Theres an added responsibility on us celebrities: Virender Sehwag on Virat Kohlis leave India comment

హైదరాబాద్: ఓ అభిమానిని 'దేశం విడిచి వెళ్లిపో' అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొహ్లీ చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించతగ్గవి కావంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విదేశాల్లో పెళ్లిచేసుకుని, విదేశీ వస్తువులకు ప్రచారం చేస్తున్న నువ్వెందుకు ఈ దేశంలో ఉన్నాంటూ ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నారు.

<strong>చెన్నైలో 3వ టీ20: పరువు కోసం విండిస్, క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను</strong>చెన్నైలో 3వ టీ20: పరువు కోసం విండిస్, క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను

కోహ్లీ వివాదంపై తాజాగా సెహ్వాగ్ మాట్లాడుతూ "కోహ్లీకి 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారి నుంచి వచ్చే కామెంట్లని చదవడం అతనికి సాధ్యమేనా? అయితే, కోహ్లీ తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు తనపై అదనపు బాధ్యత ఉంటుందనే విషయాన్ని అతను గ్రహించాలి" అని సెహ్వాగ్ సూచించాడు.

అసలేం జరిగింది?

నవంబర్‌ 5 విరాట్ కోహ్లీ 30వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన పేరిట ఓ యాప్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా కోహ్లీ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదమైంది. ఓ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ‘‘ఓవర్‌రేటెడ్ ప్లేయర్'' అని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ ఓ ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతనిలో నాకు ఏదీ ప్రత్యేకంగా కనిపించదు. ఇండియా వాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ నాకు ఎంతో నచ్చుతుంది'' అని పేర్కొన్నాడు.

 నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు

నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు

ఈ వ్యాఖ్యలపై విరాట్‌ కోహ్లీ సమాధానమిస్తూ ‘‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఎక్కడికైనా వెళ్లి బతుకు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. వేరే దేశాలను ప్రేమిస్తూ.. ఇక్కడ ఎందుకు ఉండటం. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు. నీకు ఈ దేశం సరైంది కాదు. కానీ ఇక్కడ ఉంటూ వేరే దేశాన్ని పొగడటం నాకు ఇష్టం ఉండదు'' అని అన్నాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర దేశాల క్రికెటర్లను ఇష్టపడటం వ్యక్తిగత అభిప్రాయమని.. ఆ మాత్రనికి దేశం వదిలి వెళ్లమని అనడం సరైంది కాదని నెటిజన్లు అంటున్నారు. మీరు విదేశీ దుస్తులు ధరిస్తారు, విదేశంలో పెళ్లి చేసుకుంటారు, వీదేశీ భాషలో మాట్లాడుతారు. ఇవేవీ తప్పులు కాదు. కానీ విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే, మాత్రం దేశం వదిలిపోవాలా? అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ

"నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. నాపై ఇటువంటి కామెంట్లు రావడం కొత్త కాదు. ‘ఈ భారతీయులు' అంటూ ఓ అభిమాని చేసిన వ్యాఖ్య పట్ల మాత్రమే నేను అలా మాట్లాడాను. నేను మీ అందరికి ఉన్న స్వేచ్ఛను గౌరవిస్తాను. ఈ విషయాన్ని తేలికగా తీసుకోండి. పండుగ పూట ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకుండా సరదాగా గడపండి. మీ అందరూ ఎంతో ప్రేమ, శాంతితో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.

Story first published: Friday, November 9, 2018, 20:11 [IST]
Other articles published on Nov 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X