న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతా ధోనినే: వన్డే సిరిస్ ఓటమికి కారణం చెప్పిన కోచ్

There is some light at the end of the tunnel for this Australian team: Justin Langer

హైదరాబాద్: టెస్ట్‌ సిరీస్‌ మాదిరే వన్డే సిరీస్‌ను గెలిచే అవకాశాలను చేతులారా చేజార్చుకుని ఓడిపోయామని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్‌ లాంగర్ వ్యాఖ్యానించాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పలు అవకాశాలు ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామని చెప్పాడు.

తెలివైన క్రికెటర్‌, ధోని అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే: కోహ్లీతెలివైన క్రికెటర్‌, ధోని అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే: కోహ్లీ

మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్), కేదార్ జాదవ్ (61 నాటౌట్) అజేయ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.

ఆసీస్‌ పర్యటనను ముగించిన తొలి జట్టుగా

ఆసీస్‌ పర్యటనను ముగించిన తొలి జట్టుగా

ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్‌ కోల్పోకుండా ఆసీస్‌ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. మ్యాచ్ అనంతరం జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "ఆసీస్‌ ఆటగాళ్లు సాయశక్తుల పోరాడారు. కానీ 2-1తో సిరీస్‌ కోల్పోయాం. టెస్ట్‌ సిరీస్‌లానే ఈ సిరీస్‌ను గెలిచే అవకాశాలను చేతులారా చేజార్చుకుని ఓడిపోయాం" అని అన్నాడు.

రెండు సార్లు ధోనిని ఔట్‌ చేసే అవకాశాన్ని

"గొప్ప ఆటగాళ్లకు ఎప్పుడూ అవకాశం ఇవ్వద్దు. కానీ మా ఆటగాళ్లు అదే చేశారు. రెండు సార్లు ధోనిని ఔట్‌ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇదే మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ సిరీస్‌లో మాకు కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. స్టోయినిస్‌ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్ ద్వారా రిచర్డ్‌సన్ వెలుగులోకి వచ్చాడు" అని లాంగర్ వెల్లడించాడు.

షాన్‌ మార్ష్‌ సిరీస్‌ ఆసాంతం ఆకట్టుకున్నాడు

షాన్‌ మార్ష్‌ సిరీస్‌ ఆసాంతం ఆకట్టుకున్నాడు

"అతను అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మిడిలార్డర్‌లో హ్యాండ్‌స్కోంబ్‌ ఆసాధారణ ప్రదర్శన చేశాడు. షాన్‌ మార్ష్‌ సిరీస్‌ ఆసాంతం ఆకట్టుకున్నాడు. మాకు లభించిన అవకాశాలను అందుకోలేక ఓటమి పాలయ్యాం. మరోసారి ధోని అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని ప్రదర్శన అందరికి ఓ మార్గదర్శకత్వం లాంటింది" అని జస్టిన్ లాంగర్ అన్నాడు.

సచిన్‌‌ను తలపిస్తోన్న కోహ్లీ

సచిన్‌‌ను తలపిస్తోన్న కోహ్లీ

ఇక, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలో తనకు క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ కనిపిస్తున్నాడని, అతను మైదానంలో 360 కోణంలో ఆడే షాట్స్‌ అద్భుతమని లాంగర్‌ కితాబిచ్చాడు. సచిన్‌ ఆటను ఎప్పుడూ ఆస్వాదించేవాడినని, ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ ఆట చూస్తే అలానే అనిపించిందని ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ, ధోని, రోహిత్‌ శర్మలు ఆల్‌టైం గ్రేట్‌ క్రికెటర్స్‌ అని జస్టిన్ లాంగర్ అన్నాడు.

Story first published: Saturday, January 19, 2019, 16:02 [IST]
Other articles published on Jan 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X