న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్కతో కలిసి వెన్నెల్లో మరీన్‌ బీచ్‌లో బెంచ్‌పై కోహ్లీ (వీడియో)

The other Virat Kohli: Sitting on a bench with wife on full moon night, talking sport with Roger Federer

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్ కోసం టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మను సైతం తనతో తీసుకెళ్లాడు. దీంతో కోహ్లీ ప్రస్తుతం భార్య అనుష్కతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో రెండు, మూడు వన్డేలకు మౌంట్‌ మాంగనూయ్‌లోని బే ఓవల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ ప్రాంతం ఫసిఫిక్‌ తీరప్రాంతం కావడం... ఇక్కడ ఉన్న మరీన్‌ పరేడ్‌ బీచ్‌ ప్రపంచంలోని అద్భుత సుందర ప్రదేశాల్లో ఒకటి. దీంతో అందరిలా సాధారణ జీవితం గడిపే అవకాశం తమకు లభించిందని కోహ్లీ అన్నాడు.

అనుష్కతో కలిసి మరీన్‌ పరేడ్‌ బీచ్‌లో బెంచ్‌పై

"అనుష్కతో కలిసి మరీన్‌ పరేడ్‌ బీచ్‌లో బెంచ్‌పై కూర్చొని ఆస్వాదించిన క్షణాలు జీవితాంతం గుర్తుండి పోతాయి" అని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు. "నేను, నా భార్య విదేశాల్లో సాధారణమైన జీవితం గడుపుతున్నాం. బయట వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాం. నేపియర్‌ లాంటి అందమైన ప్రదేశాల్లో విహరించడం ఆనందంగా ఉంది. అక్కడి మెరైన్‌ పరేడ్‌ బీచ్‌కు వెళ్లి నిండు చంద్రుణ్ని మనసారా ఆస్వాదిస్తూ బెంచ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. భారత్‌లో బయటకు ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. మనమంటే తెలీని వ్యక్తుల మధ్య తిరగడం మాకిష్టం" అని కోహ్లీ తెలిపాడు.

రోజర్ ఫెదరర్‌ను కలువడం మర్చిపోలేని అనుభూతి

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను కలువడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పాడు. "తనతో మాట్లాడిన ఆ క్షణాలు నిజంగా అద్భుతం" అంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫెదరర్‌పై అభిమానం చాటుకున్నాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తన భార్య అనుష్కతో కలిసి కోహ్లీ ఫెదరర్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

ఫెదరర్ గొప్ప వ్యక్తి కూడా

"ఆ భావనను మాటల్లో చెప్పలేను. చిన్ననాటి నుంచి అతడి ఆటను చూస్తున్నాను. అంతకుముందు రెండుసార్లు ఫెదరర్‌ను కలిశాను. కొన్నేళ్ల క్రితం సిడ్నీలో తను ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో నేను అక్కడికి వెళ్లాను. ఇటీవల తనను కలిసినపుడు ఆ విషయాన్ని గుర్తుచేశాడు. ప్రతీ మ్యాచ్‌కు తను ఎలా సన్నద్ధమవుతాడు.. గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తాడు వంటి ప్రశ్నలు అడుగుదామం అనుకున్నా. కానీ అతడే రివర్స్‌లో నన్ను ప్రశ్నించడం మొదలెట్టాడు. ఫెదరర్‌ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో 2-0 ఆధిక్యంలో కోహ్లీసేన

ఐదు వన్డేల సిరిస్‌లో 2-0 ఆధిక్యంలో కోహ్లీసేన

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం మౌంట్ మాంగనూయ్ లోని బే ఓవల్ స్టేడియంలో ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Sunday, January 27, 2019, 12:37 [IST]
Other articles published on Jan 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X