న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ధోనిని డకౌట్ చేసింది ఎవరో తెలుసా?

Asia Cup 2018 : MS Dhoni Out For Duck By Ehsan Khan
The Dhoni Slayer! Hong Kong’s Ehsan Khan Basks in Afterglow of Standout Moment of Career

హైదరాబాద్: ఇహ్సన్ ఖాన్.... హాంకాంగ్‌కు చెందిన ఈ స్పిన్నర్ మొన్నటి వరకు పెద్దగా ఎవరికి తెలియదు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని డౌకట్ చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌పై టీమిండియా కష్టపడి గెలిచిన సంగతి తెలిసిందే.

సూపర్-4లో భారత్ Vs పాక్: గెలుపు ధీమా వ్యక్తం చేసిన రోహిత్ శర్మసూపర్-4లో భారత్ Vs పాక్: గెలుపు ధీమా వ్యక్తం చేసిన రోహిత్ శర్మ

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ధోనిలను ఇహ్సన్ ఖాన్ పెవిలియన్‌కు చేర్చడంతో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. అయితే, చివరకు హాంకాంగ్‌పై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు హాంకాంగ్ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి సందడి చేశారు.

The Dhoni Slayer! Hong Kong’s Ehsan Khan Basks in Afterglow of Standout Moment of Career

ఈ సందర్భంగా ఇహ్సన్ ఖాన్ మాత్రం మోడ్రన్‌ క్రికెట్‌లో తన అభిమాన ఆటగాడు ధోనితో ముచ్చటించాడు. ధోని, రోహిత్‌లను ఔట్ చేసిన ఇహ్సన్ ఖాన్ ఓ స్కూల్‌ టీచర్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన ఇహ్సన్ ఖాన్ 65 పరుగులిచ్చి 2 కీలక వికెట్లను పడగొట్టాడు. తాజాగా క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ...

దటీజ్‌ ధోని!: ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదల్లేదుదటీజ్‌ ధోని!: ధోని కెప్టెన్సీని వదులుకున్నాడు, కానీ కెప్టెన్సీ ధోనీని వదల్లేదు

"ధోని అద్భుతమైన ఆటగాడు, క్రీడా విలువలు పాటించే ఆటగాడు. ధోనికి బౌలింగ్ వేశాక నాకు బంతి బ్యాట్‌కు తగిలిన శబ్దం రాలేదు. కానీ, కీపర్‌ అప్పీల్‌ చేస్తే నేను కూడా అరిచా. అంపైర్‌ కూడా ఆలోచనలో ఉండగానే.. ధోని పెవిలియన్‌ బాట పట్టాడు. ధోని వెనుదిరిగాక నీకు ఎలాంటి శబ్దమైనా వినిపించిందా అని అంపైర్‌ నన్ను అడిగాడు" అని చెప్పాడు.

The Dhoni Slayer! Hong Kong’s Ehsan Khan Basks in Afterglow of Standout Moment of Career

"ధోని నాకేం తెలియదని అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూసుంటే నాటౌట్‌గా ప్రకటించేవాడే. నిజాయితీగా ఆడే ధోని అంపైర్‌ తన నిర్ణయం ప్రకటించక ముందే వెనుదిరిగాడు. ఇది అసలైన క్రీడా స్పూర్తి. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని నాకు ఎన్నో సలహాలు, సూచనలు చేశాడు. అవి తనకెంతో ఉపయోగడతాయి. స్కూల్‌ పిల్లల ముందు నేను గర్వంగా నిలుచుంటా. ఆసియా కప్‌లో జరిగిన ఎన్నో విషయాలు నా స్టూడెంట్స్‌తో షేర్‌ చేసుకుంటా" అని తెలిపాడు.

అంతేకాదు భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులు తమ దేశంలో క్రికెట్‌ అభివృద్దికి సహకరించాలని ఇహ్సన్ ఖాన్ ఈ సందర్భంగా కోరాడు. తమ దేశంలో ఒకే ఒక అంతర్జాతీయ మైదానం, మరో రెండు చిన్న మైదానాలు ఉన్నాయని తెలిపాడు. కానీ అక్కడ ప్రాక్టీస్‌ చేయడానికి వీలుగా లేవని అన్నాడు. తమకు సహకారమిస్తే క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటామని వెల్లడించాడు.

ఇదిలా ఉంటే, ఆరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన 23వ ఆటగాడిగా ఇహ్సన్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఇహ్సన్ ఖాన్ స్వస్థలం పాకిస్తాన్‌లోని పెషావర్‌. అండర్‌-15,19 క్రికెట్‌లో పాక్‌ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. కానీ, 2012లో హాంకాంగ్‌కు వలస వెళ్లడంతో అ‍క్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం హాంకాంగ్ జాతీయ జట్టులో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు.

Story first published: Saturday, September 22, 2018, 17:10 [IST]
Other articles published on Sep 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X