న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు, డే1: వార్నర్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ... ఆసీస్ 244/3

By Nageshwara Rao
The Ashes: David Warner and Steve Smith maintain Australia dominance in Melbourne

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (65), షాన్ మార్ష్ (31) పరుగులతో ఉన్నారు.

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా నాలుగో టెస్టు స్కోరు కార్డు

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇన్నింగ్స్ 34.3 వద్ద వోక్స్‌ వేసిన బంతికి బాన్‌క్రాఫ్ట్‌(26) ఎల్బీగా పెవిలియన్‌‌కు చేరాడు. మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 103 (151 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సు) వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోక్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో వార్నర్‌కి ఇది 21వ సెంచరీ కావడం విశేషం.

అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో వార్నర్ 6000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరుపున ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. అంతేకాదు ఈ ఏడాది టెస్టుల్లో వార్నర్‌కి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (17) పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్‌ (31)తో కలిసి కెప్టెన్ స్టీవ్ స్మిత్ (65) నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కి ఇది 22వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా(1140 పరుగులు) అధిగమించాడు. ప్రస్తుతం స్టీవ్‌ స్మిత్‌​(1172 పరుగులు)తో ఈ జాబితాలో అగ్రస్థానంలోఉన్నాడు.

ఇక, ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగుల్ని సాధించిన జాబితాలో డీన్‌ ఎల్గర్‌ (1097) మూడో స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లీ (1059) నాల్గో స్థానంలో నిలిచాడు. మరోవైపు యాషెస్‌లో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్‌ జేమ్స్ అండర్సన్‌ ఏడో స్థానంలో నిలిచాడు.

100 యాషెస్‌ వికెట్లను తీయడం ద్వారా అండర్సన్‌ ఈ ఘనత సాధించాడు. మరొవైపు టెస్టుల్లో 519 వికెట్లను తీయడం ద్వారా వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ వాల్ష్‌ రికార్డుని సమం చేశాడు.

Story first published: Tuesday, December 26, 2017, 14:28 [IST]
Other articles published on Dec 26, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X