న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ ప్ర‌పంచ‌క‌ప్ చివ‌రిది: క్రికెట్‌లో ఇక‌ వారి మెరుపులు క‌నిపించ‌క‌పోవ‌చ్చు!

Team-wise one player who might retire after 2019 World Cup

లండ‌న్‌: ప్రస్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌తో పాటుగా కొంత‌మంది క్రికెట‌ర్ల కేరీర్ కూడా ముగియ‌బోతోంది. ఇక‌పై ఆ క్రికెట‌ర్లు క్రీజులో క‌నిపించ‌డం దాదాపు అసాధ్యం. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ముగిసిన త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు. ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత తాము రిటైర్ అవుతామ‌ని ఇప్ప‌టికే కొంత‌మంది అధికారికంగా ప్ర‌క‌టించేశారు కూడా. అదే జాబితాలో మ‌రి కొంద‌రు ఉన్నారు. ప్ర‌స్తుతం ఆడుతున్న ప్ర‌పంచ‌క‌ప్ వారికి చివ‌రి టోర్న‌మెంట్ అవుతుంది.

జోడు ప‌ద‌వులు కుద‌ర‌వ్‌! ఏదో ఒక‌టే..తేల్చుకోండి: వీవీఎస్‌, గంగూలీల‌కు బీసీసీఐ వార్నింగ్‌జోడు ప‌ద‌వులు కుద‌ర‌వ్‌! ఏదో ఒక‌టే..తేల్చుకోండి: వీవీఎస్‌, గంగూలీల‌కు బీసీసీఐ వార్నింగ్‌

భార‌త్‌.. మ‌హేంద్ర సింగ్ ధోనీ..

భార‌త్‌.. మ‌హేంద్ర సింగ్ ధోనీ..

ఈ జాబితాలో టీమిండియా త‌ర‌ఫున మ‌హేంద్ర సింగ్ ధోనీ సైతం ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత తాను అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొంటాన‌ని ధోనీ అధికారికంగా వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ.. అలాంటి నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ధోనీ వ‌య‌స్సు 38 సంవ‌త్స‌రాలు. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ నాటికి ఆయ‌న వ‌య‌స్సు 42కు చేరుకుంటుంది. అప్ప‌టిదాకా ధోనీ క్రికెట్ ఆడే అవ‌కాశాలు లేవు. మ్యాచుల‌ను గెలిపించే స‌త్తా ఇంకా ఆయ‌న‌లో త‌గ్గ‌లేదు. వికెట్ల వెనుక పాద‌ర‌సంలా క‌దిలే ఆయ‌న పాదాల్లో చురుకుద‌నం మాయం కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. 2023 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కూ ధోనీ జ‌ట్టులో కొన‌సాగే అవ‌కాశాలు ఎంత‌మాత్ర‌మం లేవు. ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్ వంటి యువర‌క్తం కీప‌ర్ స్థానంలో పాగా వేయ‌డానికి సిద్ధంగా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ధోనీ.. ప్రపంచ‌క‌ప్ త‌రువాత ఎక్కువ రోజులు జ‌ట్టులో కొన‌సాగ‌లేక‌పోవ‌చ్చని అంటున్నారు.

దక్షిణాఫ్రికా.. హ‌షీమ్ ఆమ్లా

దక్షిణాఫ్రికా.. హ‌షీమ్ ఆమ్లా

మిస్ట‌ర్ డిపెండ‌బుల్‌గా పేరుంది ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఓపెన‌ర్ హ‌షీమ్ ఆమ్లాకు. జ‌ట్టులో ఒక్కసారి ఆయ‌న కుదురుకుంటే బౌల‌ర్ల‌కు ఇక చుక్క‌లే. ఆ కుదురుకోవ‌డంలోనే ఆయ‌న ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 36 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్ ఒక్క‌టీ ఆడ‌లేదు. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కూ జ‌ట్టులో కొన‌సాగేది అనుమానమే. ఈ లోగా రిటైర్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

వెస్టిండీస్.. క్రిస్‌గేల్‌

వెస్టిండీస్.. క్రిస్‌గేల్‌

విధ్వంస‌క ఓపెన‌ర్‌గా పేరున్న క్రికెట‌ర్ క్రిస్‌గేల్‌. 2019 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాన‌ని మొట్ట‌మొద‌ట‌గా ప్ర‌క‌టించింది క్రిస్ గేల్‌. ఈ టోర్న‌మెంట్ త‌రువాత మ‌రో సిర‌స్ ఆడ‌తాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. టెస్ట్‌, వ‌న్డే, టీ20 ఫార్మట్ ఏదైన‌ప్ప‌టికీ.. సుడిగాలిలా చెల‌రేగిపోవ‌డం గేల్ ప్ర‌త్యేక‌త‌. కొంత‌కాలంగా ఆయ‌న నుంచి ఆశించిన మెరుపులు రావ‌ట్లేదు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో మిగిలిన మ్యాచ్‌లోనైనా ఆయ‌న తన స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఆడాల‌ని ప్ర‌తి అభిమానీ కోరుకుంటున్నాడు.

శ్రీలంక‌..మ‌ళింగ‌

శ్రీలంక‌..మ‌ళింగ‌

ల‌సిత్ మ‌ళింగ‌. విచిత్ర‌మైన బౌలింగ్ శైలితో సునామీలా దూసుకొచ్చిన క్రికెట‌ర్‌. యార్క‌ర్ల‌కు పెట్టింది పేరు. శ్లాగ్ బౌలింగ్‌లో ఆయ‌న‌ను ఎదుర్కోవాలంటే కొమ్ములు తిరిగిన క్రికెట‌ర్‌కైనా త‌ల‌ప్రాణం తోక‌కొస్తుంది. ఖ‌చ్చిత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌ను క‌ట్టి ప‌డేసే శ‌క్తి సామ‌ర్థ్యాలు ఉన్న ఫాస్ట్ బౌల‌ర్ మ‌ళింగ‌. అదంతా గ‌తం. ప్ర‌స్తుతం త‌న స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఆడ‌ట్లేదాయ‌న‌. ఐపీఎల్‌లో సైతం పేల‌వంగా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. 2019 ఐపీఎల్‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో అద్భుత‌మైన యార్క‌ర్‌తో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. ఆ ఒక్క వికెట్‌తో ఆయ‌న వైఫ‌ల్యాల‌న్నీ కొట్టుకుపోయాయి.

పాకిస్తాన్‌.. షోయ‌బ్ మాలిక్‌

పాకిస్తాన్‌.. షోయ‌బ్ మాలిక్‌

సుమారు 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నారు షోయ‌బ్ మాలిక్‌. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 37 సంవ‌త్స‌రాలు. ఈ ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో విఫ‌లం అయ్యాడు. రెండు మ్యాచుల్లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. జ‌ట్టు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆడలేక‌పోతున్నాడు. కొన్ని అరుదైన విజ‌యాల‌ను సాధించి పెట్టిన‌ప్ప‌టికీ.. వైఫ‌ల్యాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి ఈ హైద‌రాబాద్ అల్లుడి కేరీర్‌లో.

Story first published: Friday, June 21, 2019, 17:59 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X