న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌లో టీమిండియాకే ఎందుకు వరుసగా రెండు మ్యాచ్‌లు!

Asia Cup 2018 : Reasons For Two Continous Matches For India
Team India play two group matches in asia cup 2018

హైదరాబాద్: యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆసియా కప్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ డేట్ ఫిక్స్ అవగానే భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ టోర్నీకే హైలెట్‌గా నిలిచిపోతుందని క్రికెట్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

టోర్నీలో భాగంగా గ్రూప్ దశలో భారత జట్టు హాంకాంగ్‌తో తొలి గ్రూప్ మ్యాచ్ ఆడిన ఆ మరుసటి రోజే చిరకాల ప్రత్యర్ది పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడితే భారత్ విజయావకాశాలు దెబ్బతినే అవకాశాలుండటంతో బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు ఆసియా కప్ షెడ్యూల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తొలి రెండు మ్యాచ్‌లు దుబాయి వేదికగా

తొలి రెండు మ్యాచ్‌లు దుబాయి వేదికగా

టీమిండియా ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా ఆటగాళ్లకు దుబాయిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బోర్డు బసను ఏర్పాటు చేసింది. తొలుత బీసీసీఐ అధికారులు ఆటగాళ్లు బస చేసేందుకు అబుదాబిలోని ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌లో గదులు బుక్‌ చేశారు.

మార్పు వెనుక ఓ కారణం

మార్పు వెనుక ఓ కారణం

భారత్‌తో పాటు టోర్నీలో పాల్గొనే మిగతా ఐదు దేశాలకు చెందిన ఆటగాళ్లు సైతం ఇదే హోటల్‌లో బస చేయనున్నారు. దీంతో భారత ఆటగాళ్లు బస చేసే హోటల్‌ను వేరొక చోటుకి మార్చారు. ఈ మార్పు వెనుక ఓ కారణం ఉంది. ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా తన మొదటి రెండు మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. దీంతో ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

వరుసగా రెండు మ్యాచ్‌లు

వరుసగా రెండు మ్యాచ్‌లు

అంతేకాదు టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లను ఆడటం వెనుక కూడా ఓ కారణం ఉందని అంటున్నారు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ మ్యాచ్‌లకు అబుధాబిలోని షేక్ జాయెద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాలు మాత్రమే ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు ఈ రెండు స్టేడియాలు మాత్రమే ఆతిధ్యమిస్తుండటంతో భారత్‌ వరుసగా రెండు రోజుల్లో ఆడాల్సి వస్తోంది.

భారత్-పాక్ మ్యాచ్ తేదీని మార్చాలన్న బీసీసీఐ

నిజానికి టోర్నీ షెడ్యూల్ ప్రకటించినప్పుడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీని మార్చాల్సిందేనని ఆసియాకప్ క్రికెట్ కౌన్సిల్‌ను బీసీసీఐ కోరింది. అయితే, బీసీసీఐ విజ్ఞప్తిని ఆసియాకప్ క్రికెట్ కౌన్సిల్‌ పట్టించుకోలేదు. బీసిసిఐ విజ్ఞప్తిని తిరస్కరించడంతో కావాలనే ఆసియా కప్ నుంచి విరాట్ కొహ్లీకి విశ్రాంతినిచ్చారని ప్రచారం కూడా సాగుతోంది. టోర్నీలో భాగంగా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా మంగళవారం హాంకాంగ్‌తో తలపడుతుండగా... ఆ తర్వాతి రోజైన బుధవారం పాకిస్థాన్‌తో తలపడనుంది.

పాక్‌తో మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను మాత్రం భారత జట్టు ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతిలో ఓడి విమర్శలెదుర్కొన్న భారత జట్టు, అందుకు ప్రతీకారాన్ని ఈ మ్యాచ్‌లో తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. హాంకాంగ్‌పై విజయం సాధించి, పాక్ చేతిలో ఓటమి పాలైన సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 6 సార్లు నెగ్గగా, పాక్ 5 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం తేలలేదు.

Story first published: Monday, September 17, 2018, 19:51 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X