న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వివాదంలో టీమిండియా మేనేజర్: స్వదేశానికి రావాలంటూ పిలుపు!

 Team India manager Sunil Subramaniam likely to be recalled from the West Indies

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మేనేజర్ సునిల్‌ సుబ్రమణ్యం తనంతట తానే వివాదంలో చిక్కుకున్నాడు. కరేబియన్ దీవుల్లోని భారత హైకమిషన్‌ అధికారులతో అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో వెస్టిండిస్ పర్యటన మధ్యలోనే ఆయన్ను వెనక్కి పిలిపించనున్నారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా అతడు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిషేధించే యోచనలో బీసీసీఐ ఉంది.

సునిల్‌ సుబ్రమణ్యం ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుతో వెస్టిండిస్ పర్యటనలో ఉన్నారు. బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు 'నీటి పొదుపు'పై క్రికెటర్లతో ఓ వీడియో చిత్రీకరించేందుకు సహకరించాలని కరీబియన్‌ దీవుల్లోని భారత హైకమిషన్‌ అధికారులు సుబ్రమణ్యాన్ని కోరారు.

లార్డ్స్‌లో యాషెస్ రెండో టెస్టు: వర్షం అడ్డంకి, తుడిచి పెట్టుకుపోయిన తొలి సెషన్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో ఈ వీడియో చిత్రీకరణ సోమవారం జరగాల్సి ఉంది. దీనిపై భారత హైకమిషన్‌ అధికారులు జట్టు మేనేజర్‌ను సంప్రదించగా 'నన్ను సందేశాలతో ముంచెత్తకండి' అంటూ వారితో ఆయన అమర్యాదగా ప్రవర్తించారు.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో సీఓఏ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఉన్న పళంగా భారత్‌ రావాలని ఆదేశించింది. నిజానికి సునిల్‌ సుబ్రమణ్యం గతంలో కూడా ఇతర దేశాల్లోని క్రికెట్‌ బోర్డు అధికారులతో అమర్యాదగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి.

PHOTO: నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన మహిళా క్రికెటర్

అయితే, ఇప్పుడు భారత హైకమిషన్‌ అధికారులు కావడంతో అతడిపై బోర్డు చర్యలు తీసుకోక తప్పలేదు. గతేడాది డిసెంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌ టెస్టు సమయంలో అక్కడి క్యాటరింగ్‌ సిబ్బంది, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఆమ్‌ ఫ్రాసెర్‌ను తన ప్రవర్తనతో సుబ్రమణ్యం ఇబ్బంది పెట్టాడు.

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన అనంతరం కోహ్లీసేన సంబరాలు చేసుకొనేందుకు బీసీసీఐ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సంబరాల తర్వాత మిగిలిపోయిన వస్తువులను వ్యక్తిగత అవసరాల కోసం ఆయన తీసుకెళ్లారు. ఆ సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులతో ఆయన అమర్యాదగా ప్రవర్తించారు.

Story first published: Wednesday, August 14, 2019, 18:38 [IST]
Other articles published on Aug 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X