Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PHOTO: నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన మహిళా క్రికెటర్

Sarah Taylor bares it all on Instagram, reveals the reason for posting her image
Sarah Taylor bares it all on Instagram, reveals the reason for posting her nude image

హైదరాబాద్: సారా టేలర్... ఇంగ్లాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ తన బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్... ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటోంది.

ఈ కారణంగానే ఆమె ఈ మధ్యకాలంలో చాలా క్రికెట్ మ్యాచ్‌లకు సైతం దూరమైంది. గత కొంతకాలంగా ఆందోళన సమస్యతో బాధఫడుతున్న సారా టేలర్ ఇటీవలే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరిస్‌కు సైతం దూరమైంది. ఇటీవలే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన సారా సర్రే స్టార్స్ తరుఫున మంచి ప్రదర్శన చేసింది.

నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో

నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో

అయితే, బుధవారం సారా టేలర్ తన నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. అందులో దుస్తులేమీ లేకుండా వికెట్‌ కీపింగ్‌ చేస్తోంది. ఆమె తన కంఫర్ట్ జోన్‌ను దాటుకుని మరీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని సాహసం చేసింది. ఈ మంచి పనికి తనను ఆహ్వానించిన ఉమెన్స్ హెల్త్ యుకే ఆర్గనైజేషన్‌కు సారా ధన్యవాదాలు తెలిపారు.

షూటింగ్‌లో ఆమె సౌకర్యవంతంగా లేనప్పటికీ

షూటింగ్‌లో ఆమె సౌకర్యవంతంగా లేనప్పటికీ ఓ మంచి కారణం కోసం ధైర్యంగా అడుగు వేసినందుకు సారా ఇప్పుడు ఎంతగానో గర్విస్తోంది. ఇతర మహిళలకు సైతం తాను సందేశంతో కూడిన మేసేజ్‌ను పాస్ చేయడంపై ఆమె సంతోషం వ్కక్తం చేశారు. ఈ మేరకు తన ఇనిస్టాగ్రామ్‌లో నగ్న ఫోటోని పోస్టు చేస్తూ "నా గురించి తెలిసిన వారెవ్వరైనా నేను కంఫర్ట్‌జోన్‌ నుంచి కాస్త బయటకు వచ్చినట్టు తెలుసుకుంటారు. అయితే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉమెన్స్‌హెల్త్‌ యూకేకు ధన్యవాదాలు. నా దేహంతో నేనెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్నింటిని అధిగమించాను. మహిళా సాధికారతను సాధించాను. చూసేందుకు ప్రతి అమ్మాయి బాగుంటుంది. దయచేసి గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అందమైందే" అంటూ సారా టేలర్ వివరణ ఇచ్చింది.

మెంటల్ హెల్త్ సమస్య కారణంగా

మెంటల్ హెల్త్ సమస్య కారణంగా

మెంటల్ హెల్త్ సమస్య కారణంగా ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన యాషెస్ నుంచి సారా టేలర్ తనంతట తానుగా తప్పుకుంది. ఆందోళన సమస్య కారణంగా తాను విరామం తీసుకోలేదని తెలిపింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ "నేను తొలుత ఆట నుంచి 2016లో విరామం తీసుకున్నాను. అయితే ఇది సరిగ్గా అదేనని ప్రజలు భావించాలని నేను కోరుకోను" అని తెలిపారు.

ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు లేవు.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా మార్గం సుగమం

క్రికెట్‌లో పోటీ పడేందుకు

క్రికెట్‌లో పోటీ పడేందుకు

"నేను ఆ సమయంలో కొంత పురోగతి సాధించాను. నేను ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన అవరోధాలు చాలానే ఉన్నాయి. మెంటల్ హెల్త్ సమస్యను అంత త్వరగా అధిగమించలేం. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ.. దీంతో ప్రస్తుతానికి క్రికెట్‌లో పోటీ పడేందుకు సరైన సమయం అనిపించలేదు" అని సారా టేలర్ తెలిపారు.

Story first published: Wednesday, August 14, 2019, 17:01 [IST]
Other articles published on Aug 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+