న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన రైనా, పంత్!

Team India Cricketrs Suresh Raina, Rishabh Pant hit the nets together

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఇళ్లకు పరిమితమైన క్రికెటర్లు.. ఒక్కొక్కరుగా ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. మొన్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, నయావాల్ చతేశ్వర్ పుజారా, పేసర్ మహ్మద్ షమీతో పాటు మరికొందరు అందుబాటులో ఉన్న వసతులను ఉపయోగించుకుని తమ స్కిల్స్‌కు పదును పెట్టుకుంటున్నారు. అయితే వికెట్ కీపర్‌ రిషభ్ పంత్, సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా మరో అడుగు ముందుకేసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

ఈ ఇద్దరు కలిసి ఘజియాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను రైనా సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బ్యాటింగ్‌కు సంబంధించి పంత్‌కు రైనా సూచనలివ్వడం అందులో కనిపించింది. ఘజియాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రైనా చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇతనికి కొద్ది రోజుల క్రితం పంత్ జత కలిశాడు.

ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్‌లో మాత్రం ఇప్పటికిప్పుడు క్రికెట్‌ తిరిగి రావడం చాలా కష్టం. ఐపీఎల్‌పై బోర్డు ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నా... అది అంత సులువు కాదు. ఇక ఇంగ్లండ్‌లాగా బయో బబుల్‌ తరహాలో అంటే అసాధ్యమనే చెప్పవచ్చు. గతంలోనే సౌరవ్‌ గంగూలీ చెప్పినట్లు కరోనా సమయంలో ఆటల నిర్వహణలో విదేశీ తరహా క్రమశిక్షణను మనం ఇక్కడ ఆశించలేం. చిన్న పొరపాటు ఏ స్థాయిలో జరిగినా అది మొత్తానికే నష్టం కలిగించవచ్చు. ఎలా చూసినా ఆస్ట్రేలియాలోనే భారత్‌ తమ తదుపరి సిరీస్‌ ఆడే అవకాశాలే ఎక్కువ.

మానవాళి విజయసూచికగా ఒలిపింక్స్ జరగాలి: టోక్యో గవర్నర్మానవాళి విజయసూచికగా ఒలిపింక్స్ జరగాలి: టోక్యో గవర్నర్

Story first published: Tuesday, July 14, 2020, 11:58 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X