న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్రాంచైజీలలో ఇంత మార్పు, గతి తప్పాయా?

Team-by-team analysis ahead of the new season

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై దశాబ్ద కాలం దాటినా క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు జాతీయ జట్టులోకి దూసుకొచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య(ఐసీసీ) కూడా తమ అధికారిక షెడ్యూల్‌లో కూడా ఐపీఎల్‌కు చోటు కల్పించారంటే దానికున్న విలువెంటో తెలుస్తుంది. ఇప్పటికే 30 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌లో ఒక్కో జట్టు మిగతా జట్లతో ఒక్కోసారి మ్యాచ్‌లు ఆడేసింది. దీంతో అన్ని జట్లపై ఒక అంచనా కూడా వచ్చేసింది.

అన్ని జట్లపై వివరణ ఇలా విశ్లేషణ రూపంలో:

టాప్ స్థానంలో దూసుకెళ్తున్న చెన్నై:

టాప్ స్థానంలో దూసుకెళ్తున్న చెన్నై:

రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన చెన్నై అదే దూకుడుతో దూసుకుపోతోంది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు లక్ష్యంగా సాగిస్తున్న పోరాటానికి చెన్నైకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. కావేరి జల వివాదం నేపథ్యంలో చెన్నై నుంచి పూణెకు వేదిక మారినా..అభిమానుల అంచనాలను అందుకోవడంలో ధోనీసేన విజయవంతమవుతూనే ఉంది. ముఖ్యంగా కెప్టెన్ ధోనీ అన్నితానై జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తెలుగు తేజం అంబటి రాయుడు ఈ సీజన్‌లో ఇరుగదీస్తున్నాడు. రాయుడుకు తోడు ఆసీస్ మాజీ వాట్సన్, రైనా, బ్రేవోలు రాణిస్తుండటం చెన్నైకి కలిసొస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు రేసులో ముందున్న చెన్నై ఇదే జోరు కొనసాగిస్తే టైటిల్ పోరులో నిలిచినట్లే.

బౌలింగే బలంగా రైజింగ్ హైదరాబాద్:

బౌలింగే బలంగా రైజింగ్ హైదరాబాద్:

అంచనాలేమీ లేకపోయినా బౌలింగ్ బలంగా దూసుకుపోతోంది. లీగ్ ప్రారంభానికి ముందే వార్నర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలినా డీలా పడకుండా హైదరాబాద్ అద్భుతాలు చేస్తుంది. వార్నర్ లేమిని పూర్తి చేసే నేపథ్యంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విలియమ్సన్ సహచరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ జట్టుకు వరస విజయాలు అందిస్తున్నాడు. లీగ్ మొదట్లో శిఖర్ ధావన్ దూకుడు చూపించినా..ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమవుతున్నాడు. సహచరులందరూ విఫలమైన చోట నాయకునిగా విలియమ్సన్..బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. మనీశ్‌పాండే అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుండగా, యూసుఫ్ పఠాన్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. సిద్దార్థ్ కౌల్, బాసిల్ థంపీ లాంటి యువ బౌలర్లు ఆ లోటును పూడుస్తున్నారు. మరోవైపు స్పిన్ సంచలనం రషీద్‌ఖాన్, మహ్మద్ నబీ, షకీబల్ హసన్ ప్రత్యర్థిని తిప్పేస్తున్నారు. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకుంటున్న..హైదరాబాద్ టాప్-4 జట్లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఇలాగే సమిష్టి ప్రదర్శనతో రాణిస్తే హైదరాబాద్‌కు ప్లేఆఫ్ బెర్తు ఖరారైనట్లే.

గేల్ మెరుపులతో పంజాబ్ కింగ్స్:

గేల్ మెరుపులతో పంజాబ్ కింగ్స్:

కొత్త ప్రయోగంతో ఐపీఎల్ 11వ సీజన్‌లోకి అడుగుపెట్టిన కింగ్స్‌ లెవన్ పంజాబ్ అద్భుతాలు చేస్తుంది. స్టార్ స్పిన్నర్ అశ్విన్‌కు పగ్గాలు అందించిన పంజాబ్..వరుస విజయాలతో దూసుకెళ్తుంది. వేలంలో ఆఖరి రౌండ్‌లో కొనుగోలు చేసుకున్న విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌ జట్టులో కీలకంగా మారాడు. గేల్‌కు తోడు కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపిస్తుండటంతో ప్రత్యర్థి ముందు పంజాబ్ భారీ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. బ్యాటింగ్‌లో గేల్, రాహుల్, మయాంక్ అగర్వాల్, ఫించ్, కరుణ్ నాయర్ రాణిస్తుంటే...బౌలింగ్‌లో అంకిత్ రాజ్‌పుత్, బరిందర్‌స్రాన్, అశ్విన్, ముజీబుర్ ప్రత్యర్థులను కట్టడిచేయడంలో కీలకమవుతున్నారు. ఇదే ఆల్‌రౌండ్ ప్రదర్శన కొనసాగిస్తే పంజాబ్ ప్లే ఆఫ్ కల నెరవేరినట్లే.

 పరవాలేదనిపించుకుంటోన్న కోల్‌కతా:

పరవాలేదనిపించుకుంటోన్న కోల్‌కతా:

కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా.. ప్రదర్శనలో ఏ మాత్రం తేడా లేకుండా దూసుకెళ్తుంది. నిలకడ ఆటతీరుకు మారుపేరైన కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో టైటిల్ వేటలో ముందుకుసాగుతోంది. జట్టును రెండుసార్లు విజేతగా నిలిపిన గంభీర్‌ను వదులుకున్న కోల్‌కతా..దినేశ్ కార్తీక్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ కార్తీక్ కోల్‌కతాకు విజయాలందిస్తున్నాడు. సునీల్ నరైన్ తన దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన ఆరంభాలు ఇస్తుండగా, బెంగళూరుతో మ్యాచ్ ద్వారా క్రిస్ లిన్ ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో కార్తీక్, రస్సెల్, శుభ్‌మన్ గిల్ తలో చేయి వేస్తున్నారు. మిచెల్ జాన్సన్, శివమ్ మావి, కుల్దీప్, పీయూష్ చావ్లా, నరైన్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నది.

రాయల్స్‌కు ఏమైంది:

రాయల్స్‌కు ఏమైంది:

బాల్ టాంపరింగ్ వివాదంతో నిషేధం వేటు పడిన స్టీవ్ స్మిత్ దూరం కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోతోంది. చెన్నైతో పాటు రెండేళ్ల నిషేధం అనంతరం మళ్లీ బరిలోకి దిగిన రాయల్స్ జట్టు ఈసారి సీజన్‌లో అంతగా ఆకట్టుకోవడం లేదు. రహానే కెప్టెన్సీలో 7 మ్యాచ్‌లలో 3 విజయాలు, 4 ఓటమిలతో ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంటోంది. కోట్లు వెచ్చించి తెచ్చుకున్న పేసర్ జైదేవ్ ఉనద్కత్, ఇంగ్లండ్ స్టార్ బెన్‌స్టోక్స్ రాణించకపోవడం నిరాశను కలిగిస్తుంది.

కోహ్లీకి బెంగతప్పదేమో..!

కోహ్లీకి బెంగతప్పదేమో..!

ఎన్నో అంచనాలతో లీగ్ లో ఆరంభం చేసిన బెంగళూరుకు వరుస పరాజయాలు కుంగదీస్తున్నాయి. కెప్టెన్ కోహ్లీ కూడా బెంగళూరు జట్టును విజయాలబాట పట్టించడంలో విఫలమవుతున్నాడు. పేలవ ఫీల్డింగ్, అంతకు మించిన బలహీనమైన బౌలింగ్, 200 పైగా లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేని దుస్థితి బెంగళూరు జట్టును వేదిస్తుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి 5 ఓటమిలతో బెంగళూరు ప్లే ఆఫ్ చేరడం కష్టంగానే కనిపిస్తున్నది. అనూహ్య విజయాలు అంతకుమించి చెత్తగా ప్రత్యర్థులు ఓడితే తప్ప బెంగళూరు ముందంజ వేయడం అసాధ్యమే.

అప్పుడు ఛాంపియన్.. ఇప్పుడు కాదు:

అప్పుడు ఛాంపియన్.. ఇప్పుడు కాదు:

ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి నానాటికీ దారుణంగా మారుతుంది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై..ఆ స్థాయి ప్రదర్శనను కనబర్చడంలో ఘోరంగా విఫలమవుతోంది. ఐపీఎల్ టైటిల్‌ను ముచ్చటగా మూడుసార్లు దక్కించుకున్న ముంబై జట్టులో స్టార్లకు కొదువలేదు. అలాంటిది ఆఖరి ఓవర్లో ప్రత్యర్థికి మ్యాచ్‌ను చేజార్చుకున్న ముంబై ప్రస్తుతం దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేలా జయవర్దనే శిక్షణలో మెరుగులు అద్దుకుంటున్న ముంబై.. చెన్నైపై ఓటమితో ఈసారి లీగ్‌లో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. బెంగళూరుపై బోణీ కొట్టిన రోహిత్‌సేన చెన్నై విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో విజయాల జోరును కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఢిల్లీ డమాల్:

ఢిల్లీ డమాల్:

ఆటగాళ్లు, కోచ్ అందరూ స్టార్లే. కానీ, లీగ్‌లో చివరే. ప్రస్తుతం 11వ సీజన్‌లోనూ ఢిల్లీ విజయాల రుచి చూడడం లేదు. వైఫల్యాలతో ఢిల్లీ కెప్టెన్‌గా గంభీర్ తప్పుకోవడంతో యువ శ్రేయాస్ అయ్యర్ పగ్గాలు చేపట్టాడు. వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు జట్టు చీఫ్ మెంటార్ రికీపాంటింగ్ కూడా కట్టడి చేయలేకపోతున్నాడు. గతేడాది రాహుల్ ద్రవిడ్ కూడా జట్టును ప్లే ఆఫ్ చేర్చలేకపోయాడు. పుష్కలమైన నైపుణ్యం కలిగిన పంత్, అయ్యర్, విజయ్‌శంకర్ లాంటి యువకులు..మున్రో, మాక్స్‌వెల్ లాంటి హిట్లర్లు, ప్లంకెట్, అవేశ్‌ఖాన్, అమిత్ మిశ్రా, షమి, బౌల్ట్ లాంటి స్టార్ బౌలర్లు కూడా ఢిల్లీకి విజయాలు అందించడంలో విజయవంతం కాలేకపోతున్నారు. ఈసారి కూడా ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ చేరడం దాదాపు అసాధ్యమే.

Story first published: Tuesday, May 1, 2018, 10:56 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X