న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టాంపింగ్‌ కోసం వెళ్లిన పాస్‌‌పోర్టులు అందలేదు: దుబాయి వెళ్లని క్రికెటర్లు

By Nageshwara Rao
Tamim Iqbal and Rubel Hossain missed flight to UAE for Asia Cup

హైదరాబాద్: సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటి అక్కడికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్న సంగతి తెలిసిందే.

<strong>మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: విహారిని మెచ్చుకుంటూ హర్షా భోగ్లే తెలుగు ట్వీట్</strong>మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: విహారిని మెచ్చుకుంటూ హర్షా భోగ్లే తెలుగు ట్వీట్

అయితే, సమయానికి వీసా చేతికి అందకపోవడంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు క్రికెటర్లు యూఏఈ వెళ్లలేకపోయారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7.30గంటలకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు దుబాయ్‌ వెళ్లే విమానం ఎక్కాలి. అనుకున్న సమయానికి అందరు ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.

బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆటగాళ్లు అయిన తమీమ్‌ ఇక్బాల్‌, రుబెల్‌ హుస్సేన్ మాత్రం పాస్ పోర్టు అందని కారణంగా జట్టుతో కలిసి యూఏఈకి వెళ్లలేకపోయారు. ఆసియా కప్‌ టోర్నీ కోసం యూఏఈ వెళ్లేందుకు అనుమతి కోరుతూ వీరి పాస్‌పోర్ట్‌లు స్టాంపింగ్‌ కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాయి.

దీంతో అక్కడ జాప్యం జరిగి అనుకున్న సమయానికి వీరి పాస్‌పోర్టులు చేతికి అందలేదు. దీంతో వీరు సహచర ఆటగాళ్లతో కలిసి దుబాయ్‌ వెళ్లలేకపోయారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం వీరిద్దరి పాస్ పోర్టులు సోమవారానికి అందనున్నాయి.

ఈ సందర్భంగా బోర్డు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉంది. ఇక్బాల్‌, రూబెల్‌ వీలైనంత త్వరగా దుబాయ్‌ వేళ్లేందుకు చర్యలు తీసుకుంటాం" అని వారు చెప్పారు. గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, అప్ఘనిస్థాన్‌ జట్లు ఉన్నాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరగనుంది.

<strong>రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్</strong>రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్

ఇక, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్వదేశానికి చేరుకున్న వెంటనే యూఏఈకి పయనం కానుంది. ఆసియా కప్ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ని సెప్టెంబర్ 18న హాంకాంగ్‌తో తలపడనుంది. ఆ తర్వాతి రోజే భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. టోర్నీలో ఈ మ్యాచ్‌ను హైఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.

Story first published: Monday, September 10, 2018, 16:09 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X